• facebook
  • whatsapp
  • telegram

Superlative, Comparative Degree

No 'The' before Abstract Nouns!

Superlative degree అంటే తెలుసుకదా? Greatest, Smallest - ఇలా చివర + est వచ్చే మాటలూ; finest, bravest - ఇలా చివర '+ st' వచ్చే మాటలూ; most beautiful, most difficult - ఇలా ముందు most వచ్చేవీ - Superlative degree.

అలాగే చివర ' + er' వచ్చే మాటలు Greater, smaller, taller; చివర '+r ' వచ్చే మాటలు Finer, braver; ముందు more వచ్చే మాటలు more beautiful, more difficult - ఇవన్నీ Comparative degree.

Look at this sentence:

        Krishna is taller than any other boy in the class

- ఈ sentence లో taller, comparative degree.

       Comparative degree ముందు, 'the' రాదు; గమనించండి.

ఇక్కడ 'taller' (Comparative degree) తర్వాత than వస్తోంది.

గుర్తుంచుకోండి: Comparative తర్వాత 'than' వస్తే, Comparative ముందు The రాదు.

      ఇప్పుడు ఈ sentence చూడండి. Krishna is taller than Ramana - ఇక్కడ కూడా taller comparative degree. దాని తర్వాతే than వస్తోంది. అందుకని Comparative ముందు 'the' వాడం. Comparative తర్వాత than లేకపోతే comparative ముందు 'the' వస్తుంది.

       Krishna is the taller of the two (ఇద్దరిలో కృష్ణ పొడుగు).

      ఇక్కడ taller - comparative degree - దాని తర్వాత than లేదు. అందుకే, taller (comparative) ముందు, the గమనించండి.

ఇంకొన్ని ఉదాహరణలు చూడండి:

a) She is cleverer than any other girl in the group ('cleverer' followed by 'than' - so no 'the' before cleverer).

b) She is the cleverer of the two. (ఆ ఇద్దరిలో ఆమె తెలివైంది).

     ఇక్కడ no 'than' after cleverer, so 'the' before cleverer.

Soman: Seshu failed the exam. (Seshu పరీక్ష తప్పాడు).

Mohan: (I am) Not surprised at all. He is lazy. The lazy can never pass. (నాకేం ఆశ్చర్యంగా లేదు. వాడు సోమరి. సోమరివాళ్లు ఎప్పుడు pass కాలేరు.)

Soman: No. It all depends on luck. The lucky get what they want, hard work or no hard work. (కాదులే. అంతా అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అదృష్టవంతులెప్పుడూ వాళ్లకు కావల్సినవి పొందుతారు, కష్టపడినా, పడకపోయినా.)

పై సంభాషణలో, the lazy, the lucky అని ఉంది కదా?

ఇక్కడ lazy, lucky, adjectives

(గుణాన్ని, స్థితిని తెలిపే పదాలు, అయితే, అయినటువంటి అనే అర్థాలతో.

lazy = సోమరి అయిన, సోమరితనం ఉన్న, Lucky = అదృష్టవంతులైన/ అదృష్టం ఉన్న).

Adjective ముందు 'the' వాడితే, ఆ గుణం ఉన్నవాళ్లు అనే అర్థం వస్తుంది.

a) The rich and the poor are the same to god.

(rich = ధనం ఉన్న; The rich = ధనవంతులు; Poor = బీద; the poor = బీదవాళ్లు).

b) The hardworking always come up.

(Hardworking = శ్రమించడం; The Hardworking = శ్రమించేవాళ్లు/ కష్టపడి పనిచేసేవాళ్లు.)

     ఒక జాతి మొత్తాన్ని లేదా ఒక తెగకు చెందినదాన్ని తెలపడానికి, 'the' వాడవచ్చు.

a) The dog is a faithful animal = కుక్క (అన్ని కుక్కలూ) విశ్వాసం ఉన్న జంతువు (లు).

b) The lion is courageous = సింహం (అన్ని సింహాలు) ధైర్యం కలది (వి).

Nandan: Gold is becoming costlier and costlier day by day. (బంగారం రోజురోజుకీ ప్రియమైపోతోంది.)

Bhargav: Those who buy it are also increasing. But the worry is even petroleum prices are rising. (దాన్ని కొనేవాళ్లు కూడా పెరిగిపోతున్నారు. కానీ ఆందోళన కలిగించేది, పెట్రోలియం ధరలు కూడా పెరుగుతున్నాయి.)

Nandan: With it the prices of iron and steel, of other things like rice and wheat also go up, life becomes difficult -

(దాంతో ఇనుము, ఉక్కు ధరలు; బియ్యం, గోధుమలాంటి ఇతర వస్తువుల ధరలూ పెరుగుతాయి. జీవితం కష్టం అయిపోతుంది.)

Bhargav:  Does gold give you happiness? On the otherhand it makes you sleepless. Keeping it safe caused a lot of worry. 

 (బంగారం సంతోషాన్నిస్తుందా? దానికి బదులు అది నిన్ను నిద్రకు దూరం చేస్తుంది. దాన్ని జాగ్రత్తపరచుకోవడం పెద్ద బాధ).

Nandan: The little gold that we can buy need not worry us. (మనం కొనగలిగే చిన్న మొత్తం బంగారం అంతేం బాధ కలిగించదులే.)

ఇది చూడండి:

a) Gold is becoming costlier.

b) Petroleum prices are rising.

c) The prices of iron and steel.

d) Of other things like rice and wheat.

        Gold, Petroleum, Iron, Steel, Rice, Wheat - ఇవన్నీ పదార్థాల పేర్లు కదా. వీటిముందు a/ an/ the లేకపోవడం గమనించండి.

పదార్థాల పేర్లను material nouns అంటారు.

అర్థమయ్యే ఉంటుంది: Material nouns ముందు, 'the' రాదు.

Cotton is grown in India (భారత్‌లో పత్తి పండించబడుతుంది.

మామూలు తెలుగు - పత్తి పండుతుంది)

       Cotton (పత్తి) పదార్థం పేరు బట్టి, ముందు 'The' రాదు.

Coffee is made from coffee powder, milk and sugar, (కాఫీని కాఫీ పొడి, పాలు, పంచదారతో చేస్తారు)

అలాగే మనుషులు, వస్తువుల గుణాల పేర్లు ముందు కూడా, 'The' రాదు. అంటే మనం ఊహించుకోగలిగేవాటి పేర్లు. వీటిని abstract nouns అంటారు.

        Beauty gives us happiness (అందం మనకు ఆనందాన్నిస్తుంది) అందం, ఆనందం - ఇవి ఇలా ఉంటాయని చెప్పలేం కదా? ఇవి abstract nouns. వీటి ముందు 'The' రాదు.

Nisanth: Where do you go at 9 every morning?

Vidaya: Dont you know? I am a student. I go to school. (తెలియదా? నేను విద్యార్థిని. స్కూల్‌కు వెళ్తాను.)

Nisanth: This morning just when you started for school my dad, an asthma patient, started for hospital. (ఇవాళ ఉదయం నువ్వు

                   స్కూల్‌కు బయల్దేరిన సమయానికే, ఉబ్బసంతో ఉన్న మా నాన్న ఆస్పత్రికి బయల్దేరాడు).

Udaya: Mom went to temple to do puja too. (మా అమ్మకూడా అదే సమయంలో పూజ కోసం గుడికి వెళ్లింది).

గమనించండి: To school, for hospital, to temple - ఇక్కడ school, hospital, temple ముందు 'The' లేకపోవడం. ఇది ముఖ్యం.

         School, College, hospital, Temple, Church, bed లాంటివాటి ముందు ఈ కింది సందర్భాల్లో 'The' ఉపయోగించం.

a) School/ College (విద్యార్థులు/ ఉపాధ్యాయులు, చదువు సందర్భంలో)

b) Hospital (రోగులు/ వైద్యులు వైద్యం సందర్భంలో)

c) Temple, Church, Masjid (పూజలు, ప్రార్థనలకు వెళ్లినప్పుడు)

d) Bed (విశ్రాంతి/నిద్రకు వాడినప్పుడు). ఎవరన్నా School విద్యార్థి అనడానికి He/ She goes to school.

A: What are Your Children? (మీ పిల్లలేం చేస్తారు?)

B: They go to school. (వాళ్లు విద్యార్థులు)

Look at the following:

¤ No 'The' before the main meals of the day.

(రోజూ చేసే భోజనం ముందు 'The' రాదు).

¤ I have breakfast at 8 in the morning.

¤ She invited me to lunch/ dinner/tea tomorrow.    

Wife: The teacher beat our son black and blue.

                  (టీచర్ మన పిల్లాడిని చితక్కొట్టాడు) 

                                                       Beat blue and black = చితక్కొట్టడం

Father: What kind of teacher is he? What sort of teaching is his?

                   (అతడేం టీచర్? అతడిదేం బోధన?)

                                                            sort = kind = విధం 

    What/ that/ This kind of/ Type of/ sort of/ manner of ఇలాంటి చోట్ల Kind of/ Type of/ sort of/ manner of ముందు లేదా వెనక a/ an/ the రావు.

Exercise

Fill in the blanks with 'a/an' and 'the' where necessary. If 'a/an' and/the are not necessary mark '0' (Zero).

1. ............ cellphone is ............ useful device. device = పరికరం 

2. This is ............ book ............ teacher has told us to buy.

3. ............ gold is ............ precious metal, and has been............ cause of many wars. Precious = విలువైన

4. 4) Don't waste ............ time. Go to ............ doctor immediately. Your fever has not come down.

5. 'Are you new to this place?' ' Yes. This is ............ first time I am out on ............ plane. ............ sky is blue and ............  whether, pleasant. Pleasant=ఆహ్లాదకరమైన 'Wish you ............ happy flight' (flight = విమానయానం)

6. ............sun is ............ big globe of ............ burning gasses, ............ scientists say.

7. ............ Pacific is ............ deepest Ocean.

8. ............ higher you climb, ............ colder you feel. (ఎత్తెక్కినకొద్దీ, చలి ఎక్కువవుతుంది).

9. Last year, ............ earthquake levelled all ............ buildings in ............ area. ............ number of deaths was put at 2000.

10. 'Why don't you sing ............ song?' '............ song I can sing is not - ............ modern type.' 'Doesn't (does not) matter. You have ............ sweet voice. It is ............ voice that is important'.

11. ............ Ganga is ............ holy river for ............ Hindus.

It is among ............ longest rivers of India.

12. 'Is Damodar at home?'. 'No. It's (It is) past 9 you see.

He is a student and he starts for ............school at 9. I am going to ............ school to pay ............ fees, and talk to ............ teachers there'.

13. Mr. Singh, ............ Director General of Police, is ............ honest officer. He is ............ best officer we have had so far.

14. ............ gold is not so useful as ............ steel, though it costs more than ............ steel.

15. Gandhi believed that ............rich should help ............ poor.

16. ............gold found in ............ Tiruvanantapuram temple runs to lakhs of crores of rupees.

17. He is ............poor man. He has ............family to support.

18. ............ Nile, is supposed to be ............ longest river in ............World.

19. Of ............ two boys that came here, ............ older one is ............ son of ............ teacher.

20. ............ Mt. Everest is ............highest peak in ............ Himalayas.

Answers:

1. A cell phone is a useful device (cell phone, device - both of them are countable singulars. So a before each of them).

2. This is the book the teacher has told us to buy. ('The' before book, because if you put the question - which book, you got 111 the answer, the book the teacher has told us to buy; the before teacher because, the speaker and the listener know about it.

ఏ పుస్తకం? teacher చెప్పిన పుస్తకం; అందుకని book ముందు 'The', మాట్లాడేవాళ్లకూ, వినేవాళ్లకూ తెలిసిన teacher కాబట్టి, 'the teacher').

3. 0 Gold is a precious metal, and has been the cause of many wars. [Gold, silver, rice etc are uncountables, so no a/an/the before it. 'The' before cause - ఎందుకంటే, ఏ కారణం అని ప్రశ్నిస్తే, of many wars అని answer లో వస్తుంది కాబట్టి).

4. Don't waste 0 time. Go to a doctor immediately. The fever has not come down. (Time కి కాలం అనే అర్థమైతే 'The' రాదు. సమయం, గంటలు, నిమిషాలతో తెలిపేదైతే, 'the' వస్తుంది.

Doctor - countable singular కాబట్టి, a doctor. Fever గురించి అంతకు ముందే, speaker కు, listner కు తెలుసు కాబట్టి, the fever). 

5. The first time - first, second, third లాంటి వాటి ముందు, the ఉండాలి. 

¤ The sky- ఒకరకానికి చెందిన వస్తువు ఒక్కటే ఉంటే, దాని ముందు, The వాడతారు. The earth, the sun, the moon etc.

¤ The whether - ఇక్కడ ఇద్దరికీ (మాట్లాడే, వినే) తెలిసిన విషయం కాబట్టి. 

¤ a happy flight - flight, countable, singular

6. The sun (sun ఒక్కటే కాబట్టి); is a big globe ('globe' countable singular) 0 burning gasses - ఫలానా gasses అని తెలియదు కాబట్టి.

7. Pacific - name of an ocean, so, the Pacific; deepest - superlative degree, so, the Pacific.

8. Higher, colder - comparative degree తర్వాత than లేదు కాబట్టి, వాటి ముందు, 'The' వస్తుంది. - the higher, ... the colder.

9. An earthquake, because, we are talking about one earthquake; the buildings, because, we are talking of particular  

    (ఫలానా) buildings [ఆ చోటులో (area) ఉన్న buildings]; the area, because మనకు తెలిసిన area, the number of deaths - అక్కడి మృతుల సంఖ్య కాబట్టి.

10. 'Why don't you sing a song - a song because, any/ one song.

¤  The song I can sing - నేను పాడగలిగిన పాట. ఏ పాట? అనే ప్రశ్నకు సమాధానంగా వస్తుంది కాబట్టి. The modern type - ఫలానా రకం అంటున్నాం కాబట్టి, the ఉపయోగించాలి.

       Sweet voice - voice, countable singular. It is the voice that .....,ముఖ్యమైంది ఏదైతే ఉందో ఆ voice కాబట్టి the voice.

11. The Ganga, గంగానది పేరు కాబట్టి a holy river - river countable singular కాబట్టి. The longest - longest superlative degree కాబట్టి.

12. Starts for 0 school. Students వెళ్లేది school కే కాబట్టి, school ముందు 'the' రాదు. I am going to the school, to pay the fees and talk to
       the teachers there. 

¤ నేను ((I) school కు విద్యార్థిగా వెళ్లడం లేదు, (fees కట్టేందుకు వెళ్లే parent) కాబట్టి, the school. అక్కడ కట్టాల్సిన 'fees' కాబట్టి the fees.

     అక్కడి teachers (ఏ teachers?) కాబట్టి the teachers.

13. Mr.Sing,  Director General of Police (వ్యక్తి పేరు తర్వాత వాళ్ల హోదా (designation)రాస్తే, దాని ముందు the రాదు.) 

¤ Officer - countable singular, so an honest officer. 'Best' superlative degree, so 'the' best.

14.  Gold is not so useful as  steel, though it costs more than  steel.

        Gold, steel - countable singulars కావు, కాబట్టి, a రాదు. ఏ gold?steel? అంటే answers లేవు. కాబట్టి the రాదు.

15. Gandhi believed that the rich must help the poor. గుణాల పేర్ల ముందు, 'the' వాడితే, ఆ గుణం కలవాళ్లు అనే అర్థం వస్తుంది.

    Good = మంచి, the good = మంచివాళ్లు

         పై sentence లో కూడా rich = డబ్బున్న. The rich = డబ్బున్నవాళ్లు, poor = బీద, the poor = బీదవాళ్లు.

16. The gold found in Tiruvananthapuram temple - ఏ gold? అనే ప్రశ్నకు, ఆ గుడిలో దొరికిన gold అని సమాధానం వస్తుంది కాబట్టి, the gold.

17. The Nile (Nile is the name of a river కాబట్టి), is supposed to be the longest (Superlative degree కాబట్టి) river in the world  (world = ప్రపంచం - ఒక్కటే కాబట్టి).

18. Of the two boys that came here ( ఏ ఇద్దరు boys? ఇక్కడికి వచ్చిన boys అని జవాబుంది కాబట్టి) the older (older, comparative degree తర్వాత than లేదు కాబట్టి, a teacher - ఫలానా teacher అని చెప్పడం లేదు కాబట్టి).

19.  Mt. Everest (Mt. Everest, ఒక పర్వతం పేరు కాబట్టి, దాని ముందు "the" రాదు. The highest - highest superlative degree)  the Himalayas - Himalayas - ఒక పర్వతం కాకుండా పర్వతపంక్తి (a range of mountains) కాబట్టి. 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌