• facebook
  • whatsapp
  • telegram

  There is no accounting for taste  

Sekhar: I ran into our old friend Bhagvan yesterday as I was on my way to college.(నిన్న నేను కాలేజీకి వెళుతుంటే మన పాత స్నేహితుడు భగవాన్ కలిశాడు.)

Rishi: Oh Did you? How is he? Why was he here? He was a terrible smoker. Has he given up or is he still smoking?

(అవునా. ఎలా ఉన్నాడతడు? ఎందుకున్నాడిక్కడ? అతడు సిగరెట్లు ఎక్కువగా తాగేవాడు. ఇప్పుడు మానేశాడా? ఇంకా తాగుతున్నాడా?)

Sekhar: He appears to have given it up. We spent an hour together and I didn't see him smoke. He is settled in a good job and he is well off. (మానేసినట్టున్నాడు. గంట సేపు కలిసే ఉన్నాం, అతడు సిగరెట్ తాగడం నేను చూడలేదు. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇప్పుడతడు ఆర్థికంగా బాగానే ఉన్నాడు.)

Rishi: You remember his dad had a set back in his business. There was an income tax raid too. That set off all their troubles.

(వాళ్ల నాన్నకు వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆదాయ పన్ను వాళ్లు దాడి చేశారు. అక్కడి నుంచి వాళ్లకు ఇబ్బందులు ప్రారంభం అయ్యాయి.)

Sekhar: Was that so? I have not been aware of it. Any way from his talk I understood that they had left all that behind and well on the way to prosperity.      

(అవునా! నాకది ఇంత వరకూ తెలియదు. ఏదేమైనా అతడి మాటల్లో నాకర్థమైందేంటంటే అదంతా గతం అనీ, వాళ్లంతా ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారని.)

Rishi: Good for them. They had better keep out of harm's way by not doing anything risky, as they did in the past.

(మంచిదే. గతంలో మాదిరిగా ప్రమాదకరమైందేదీ చేసి కీడు తెచ్చుకోకుండా ఉండటం వాళ్లకు మంచిదే.)

Sekhar: You seen to be knowing them in and out. (వాళ్ల గురించి నీకు మొత్తం తెలుసనుకుంటున్నాను.)

Rishi: Yea. Sorry. It slipped my mind. His father and my father went to the same college and were close.

(Sorry మర్చిపోయాను. వాళ్లనాన్న మానాన్న ఒకే కాలేజీలో చదువుకున్నారు, మంచి స్నేహితులు.)

Sekhar: That accounts for your knowledge of them.

(ఆ కారణం వల్లే నీకు వాళ్లు బాగా తెలుసన్నమాట.)

Rishi: Yea. Think I left. See you. Bye.

(ఇప్పటికే వెళ్లుండాల్సింది. వస్తాను.)

Look at the following phrasal verbs and idoms from the conversation above.

1) I ran into our old friend Bhagvan, as my way to college.

2) Has he given up or is he still smoking?

3) He is well off.

4) That set off all their troubles.

5) ..... that they had left all that behind.

6) They had better keep out of harm's way.

7) That accounts for your knowledge.

Note:

 Be aware = To know (తెలిసి ఉండటం)

 Prosperity = మంచి స్థితికి ఎదగడం/ఉండటం; Prosper = అభివృద్ధి చెందడం

1) To ran into = Meet someone by chance/ unexpectedly

a) Sudha: Can you guess who I ran into this morning?

(ఈరోజు ఉదయం నేను అనుకోకుండా ఎవరిని కలుసుకున్నానో ఊహించగలవా?)

Padma: How can I? Am I a seer or what?

(నేనెలా ఊహించగలను? నేనేమన్నా రుషినా?)

Sudha: Our English teacher at school.

(స్కూల్లో మన ఇంగ్లిష్ టీచర్.)

b) Just as I was entering office, I ran into an old friend of mine.

    (ఆఫీస్‌లోకి అడుగుపెట్టబోతుంటే అనుకోకుండా నా పాత మిత్రుడొకడు తారస పడ్డాడు.)

c) As he jumped out of the window, the thief ran into a policeman.

   (కిటికీ లోంచి దూకి పారిపోతుండగా దొంగకు పోలీసు ఎదురుపడ్డాడు.)

2) Has given up - Present perfect of 'give up'

     = Stop doing something

     = చేస్తున్న పనిని మానేయడం/ అలవాట్లు వదులుకోవడం 

a) Seenu: I am unable to get rid of this cough.

 (ఈ దగ్గును వదిలించుకోలేకపోతున్నాను.)

Get rid of = వదిలించుకోవడం

Surya: Give up smoking and you can.

(పొగ తాగడం మానుకో నువ్వు దగ్గును వదిలించుకోగలవు.)

b) Ravi: Where is Mohan now and what is he?

(మోహన్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు?)

Suman: After trying hard to get into a govt job, he gave up, and joined as a lecturer in a college.

    (ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి ప్రయత్నించి, రాకపోవడంతో అది మానుకుని, కాలేజీ లెక్చరర్‌గా చేరాడు.)     (అనుకోకుండా ఎవరినైనా కలుసుకోవడం/ ఎవరైనా మనకు తారసపడటం)

 3) Well off = Be rich enough to lead a good standard of life. = మంచి జీవితం గడిపేందుకు చాలినంత డబ్బుండటం.a) Purandhar: How is your uncle's retired life?

 (విశ్రాంత ఉద్యోగిగా మీ బాబాయి జీవితం ఎలా ఉంది?)

Eswar: He is quite well off - He has his pension and his savings which can see him through comfortably.

(బాగానే ఉన్నాడాయన. మంచి పెన్షన్, పొదుపు చేసుకున్న డబ్బు వల్ల ఆయన జీవితం సుఖమయంగా ఉంది.)

b) Almost all Indians doing jobs/ settled in America are well off

(అమెరికాలో ఉద్యోగం చేస్తున్న లేదా అక్కడే స్థిరపడిపోయిన భారతీయులు బాగా డబ్బున్నవాళ్లే.)

  well off × badly off

In the past government pensioners used to be badly off

(గతంలో ప్రభుత్వ పెన్షన్ పొందేవాళ్లు చాలా బీదవాళ్లు.) 

4) Set off = Cause a series of events/ a lot of activity = వరసగా చాలా సంఘటనలు జరిగేలా చేయడం/ సమస్యలు లేవదీయడం

Pramod: These ministers often make irresponsible comments.

(మంత్రులు తరచూ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తుంటారు)

Vinay: I know what you are talking about. It's the minister's comments on farmers yesterday that set off a conflict between his followers and rivals.

(నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలుసు. నిన్న రైతులపై మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన అనుచరులకూ, ప్రత్యర్థులకూ మధ్య పెద్ద వివాదాన్ని సృష్టించాయి/ లేవదీశాయి.)

The small fight at the tap has set off a number of fights between two groups in the area.

(పంపు దగ్గర గొడవ రెండు వర్గాల మధ్య పోట్లాటను లేవదీసింది/ ప్రారంభించింది)
 

5) Left something behind - Past tense of leave something behind                                                    = Leave behind something

                                                    = Not do something or experience it any more

చేస్తున్న పనిని (ముఖ్యంగా చెడు విషయాలు) ఇంకెంత మాత్రం చేయకుండా ఉండటం/ పాత అనుభవాలను మళ్లీ జరగకుండా చూసుకోవడం/ వదిలివేయడం. 

a) Bhaskar: What a change in Prasad/ He no longer smokes it seems.

(ప్రసాద్‌లో ఎంత మార్పు! ఇప్పుడతను పొగ తాగడం లేదు.)

  Devender: Sure. He used to drink to but he has left all that behind.

(నిజమే. తాగేవాడే కానీ అవన్నీ వదిలేశాడు ఇప్పుడు/ అదంతా గతం.) 

b) Nagaraj: Karunakar is not much seen now a days. He used to more about with a lot of friends, didn't he?

 (కరుణాకర్ ఈ మధ్య కనిపించడం లేదు. ఎప్పుడూ స్నేహితులను పోగేసుకుని తిరిగేవాడు)

    Mahesh: Yes. Perhaps he has left that behind and started studying seriously.

     (అవును. బహుశా అదంతా మానేసి, బాగా చదవడం మొదలు పెట్టాడేమో!)

6) Out of harm's way - చాలా తరచుగా వాడే, చాలా ఉపయోగమైన idiom.

అర్థం - కీడు జరగకుండా చూసుకోవడం

Out of harm's way = Be safe from trouble or danger. 

              Harm = కీడు

If somebody is out of harm's way they are free from trouble/ harm (కీడు)

       = కీడుకు దూరంగా క్షేమంగా ఉండటం.

a) Ram Kumar: Why are you keeping those medicines locked away?

(ఆ మందులకు ఎందుకు తాళం పెడుతున్నావు?)

Bharath: We have two children. Kocking them up alone will keep them out of harm's way.

(మా ఇంట్లో పిల్లలున్నారు. మందులను దూరంగా పెడితేనే వాళ్లు క్షేమంగా ఉంటారు.)

b) Mani: You'd better not meddle in politics.

    (రాజకీయాల్లో తలదూర్చకు.)

Meddle = కల్పించుకోవడం (జోక్యం చేసుకోవడం)

Sankar: No such thing. I never do. I keep myself out of harm's way.అలాంటిదేం లేదు. ఎప్పటికీ నేనలా చేయను. కీడుకు దూరంగానే ఉంటాను.)     

7) Account for - ఇది కూడా చాలా తరచుగా వాడే phrasal verb. దీన్ని కూడా మనం సంభాషణలో వాడదాం.

Account for = కారణం

Account for something = 1) To be the cause of something;

                                        2) Explain (కారణమవడం)

a) Raghu: We have a large number of failures in the exam.

(ఈసారి పరీక్షలో తప్పినవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.)

Mallik: For one thing the paper was rather tough and secondly a few questions were out of syllabus.

(ఒకటేమో ప్రశ్నపత్నం కష్టంగా ఉంది, రెండోది, కొన్ని ప్రశ్నలు పాఠ్యాంశాల లోనివి కావు)

Raghu: You mean that accounts for it?

(అంటే నువ్వు అదే కారణమంటున్నావా?)

b) Narayana: What accounts for the slow down in the progress of India?

(భారత పురోభివృద్ధి మందగించడానికి కారణమేంటి?)

Omkar: What else? Corruption - that too large scale corruption accounts for it.

(ఇంకేంటి? అవినీతి - భారీ అవినీతే అందుకు కారణం)

ఇది కూడా చూడండి.

c) There is no accounting for taste.

అభిరుచికి కారణం ఉండదు. అంటే ఎవరు, ఎందుకు, దేన్ని ఇష్టపడతారు అంటే దానికి కారణం ఉండదు

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌