• facebook
  • whatsapp
  • telegram

 I haven't breathed a word of it!

Murali: Could you meet me this evening? We can sit together and work out a solution to the problem.

(ఈ రోజు సాయంత్రం నువ్వు నన్ను కలుస్తావా?మనం ఇద్దరం కూర్చొని ఆ సమస్యకు ఏదైనా పరిష్కారాన్ని చూద్దాం.)

Vinod: Certainly. The earlier we end the problem the better. Did you bring up this topic with Murthy? He was asking me about it this morning.

(ఇది ఎంత త్వరగా సమసిపోతే అంత మంచిది. ఈ విషయాన్ని మూర్తితో ఏమైనా ప్రస్తావించావా? ఈ రోజు ఉదయం అతడు నన్ను అడిగాడు.)

Murali: I haven't breathed a word about it to anyone. We have decided to keep it under wraps and I have stick to the idea.

(ఈ విషయం గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు నేను. మనం దాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నాం. నేను దానికి కట్టుబడి ఉన్నాను.)

Vinod: I ran into Murthy on my way to office. He stopped me and raised the topic. I almost told him not to poke his nose into things that didn't concern him. With great difficulty could I hold myself back.

(నేను ఆఫీస్‌కి వెళుతూ మూర్తిని చూశాను. నన్ను ఆపి ఈ విషయం గురించి అడిగాడు. అతడికి సంబంధం లేని విషయాల్లో తలదూర్చొద్దన్నన్నాను. అతికష్టం మీద వెనక్కి తగ్గాను.)

Murali: Yea, he is very nosy. It is better to leave him alone. Let's play safe.

(అవును. అతడికి ఆరాలు తీసే అలవాటు ఎక్కువ. అతడి మానాన అతడిని వదిలేయడం మంచిది, ప్రమాదం లేకుండా.)

Vinod: That's what I thought too. Once we get over with the whole thing, it doesn't matter who comes to know of it.

(నేనూ అదే అనుకున్నా. ఇది ముగింపునకు వస్తే, తర్వాత ఎవరికి తెలిసినా ఫర్వాలేదు.)

Murali: Let's meet in the evening. (సాయంత్రం కలుద్దాం.)

Look at the following expressions from the conversation above

       1. Work out a solution to the problem.

       2. Did you bring up this topic ........?

       3. I haven't breathed a word of it.

       4. I ran into Murthy.

       5. I almost told him not to poke his nose into things.

       6. With great difficulty could I hold myself back.

       7. Let's (Let us) play safe.

1. Work out = Find a solution to a problem

                     = సమస్యకు పరిష్కారం కనుక్కోవడం

Work out a problem = Find a solution అని కూడా అంటాం.

a) Bhaskar: We are caught in a big problem. How to get out of it?

                      (మనం పెద్ద సమస్యలో చిక్కుకున్నాం. బయటపడటం ఎలా?)

Chitra: Let's sit together and study it. We can work it out.

            (కూర్చొని పరిశీలిద్దాం. ఏదో విధంగా పరిష్కారం కనుక్కోగలుగుతాం.)

b) Anwar: You haven't yet worked out how we are going to travel without reservation, have you?

(రిజర్వేషన్ లేకుండా మనం ఎలా ప్రయాణించబోతున్నామనే దానికి పరిష్కారం ఏమైనా కనుక్కున్నావా?)

Sahir: I have, of course. I know some one in the railways and he has promised to help.

(నేను కనుక్కున్నా. రైల్వేలో నాకు తెలిసినవారు ఒకరున్నారు. ఆయన సాయం చేస్తానని మాటిచ్చాడు.)

     "Work out" has other meanings too:

1) Things do not always work out the way we wanted them to = అన్ని విషయాలూ మనం అనుకున్నట్లుగా జరగవు.

2) Work out = Understand (someone's character) = ఒకరిని అర్థం చేసుకోవడం

He hasn't been able to work her out, though he has been with her for ten years.

(అతడు ఆమెతో పదేళ్లుగా ఉంటున్నా, ఆమెను అర్థం చేసుకోలేకపోతున్నాడు.)

Work out = Calculate = లెక్కపెట్టడం

He worked it out and found we need Rs.10000.

అతడు లెక్కపెట్టాడు. మనకు రూ.10000 అవసరమని తేల్చాడు.

2. Bring up a topic = ఒక విషయాన్ని లేవనెత్తడం/ ప్రస్తావించడం

a) Sunanda: We were discussing plans for future and she suddenly brought up the topic of your marriage.

(మేం భవిష్యత్తు గురించి చర్చిస్తుంటే ఆమేమో నీ పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది.)

Vasantha: Why did she do it? I told her not to bring up such matters.

(ఆమె అలా ఎందుకు చేసింది? నేను ఆమెకు అలాంటి విషయాలు ప్రస్తావించవద్దని చెప్పాను.)

b) Chandra: Whatever the topic of discussion, he always brings up the topic of movies.

(మనం చర్చిస్తున్నది ఏ విషయమైనా... అతడు సినిమా విషయాన్ని లేవనెత్తుతాడు.)

Tarun: I'll (I will) warn him not to.

(అలా చేయొద్దని అతడిని హెచ్చరిస్తాను.)

3. Breathe a word of something: రహస్యాన్ని బట్టబయలు చేయడం. ఎక్కువగా దీన్ని "not"తో అంటే రహస్యాన్ని బయట పెట్టవద్దు అనే అర్థంతో వాడతాం.

a) Ramesh: His coming here is a top secret. Don't let it out.

(అతడు ఇక్కడికి రావడం అత్యంత రహస్యమైన విషయం. దాన్ని బయటపెట్టకు.)

Supriya: I will not breathe a word about it to anyone.

(దాని గురించి ఎవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పను.)

b) Prasad: Didn't they know it?

(వాళ్లకది తెలియదా?)

Kumar: They had known it all along, but they did not breathe a word of it to anybody, the rogues.

(వాళ్లందరికీ ఎప్పటినుంచో తెలుసు. కానీ దాని గురించి ఎవరితోనూ ఒక్క మాట కూడా అనలేదు దుర్మార్గులు.)

4. Ran into somebody - Past tense of Run into somebody

= అనుకోకుండా ఎవరినైనా కలుసుకోవడం = Meet somebody unexpectedly.

a) Subba Rao: You are all smiles. What is the matter?

(నీ మొహం నిండా చిరునవ్వు? ఏంటి సంగతి?)

Sekhar: I ran into a childhood friend of mine on my way here. A joke he made is what causes the smile.

(ఇక్కడికి వచ్చే దారిలో నా బాల్యమిత్రుడు కనిపించాడు. వాడు వేసిన జోక్ నాకు ఇంకా నవ్వు తెప్పిస్తోంది.

b) Mani: Hi Gopal, What's news?

(హాయ్ గోపాల్... ఏంటి విశేషాలు?)

Sankar: Look at this news here. Jumping out the window of the house where he had stolen jewellery, the thief ran into a constable on duty.

(ఈ వార్త చూడు. నగలు దొంగిలించిన ఇంటిలోంచి దూకి, బయటకు వస్తూ ఈ దొంగ పోలీసు కానిస్టేబుల్‌కే తటస్థపడ్డాడు.)

5. Poke one's nose into others' affairs: ఇతరుల విషయాల్లో తలదూర్చడం.

a) Ravi: Where were you yesterday?

(నిన్న నువ్వు ఎక్కడున్నావు?)

Nagaraj: Why do you want to know?

Don't poke your nose into my affairs, I warn you.

(నీకెందుకు? నా విషయాల్లో తలదూర్చకు. నీకు గట్టిగా చెబుతున్నా.)

b) Hanuman: You had better tell your friend to keep off me.

(నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని నీ స్నేహితుడితో చెప్పు.)

Siva: Why? What happened?

(ఎందుకు? ఏమయ్యింది?)

Hanuman: He enquired of my cousin how much property I have. How's he interested? Let him not poke his nose into my matters.

(నాకు ఎంత ఆస్తి ఉందని మా కజిన్‌ను అడిగాడట. అతడికి అంత ఆసక్తి ఏంటి? నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పు.)

6. Hold oneself back = Control oneself = మనల్ని మనం అదుపులో ఉంచుకోవడం.

a) Manoj: Why were you quiet when Suraj was banging you so awfully?

(సూరజ్ నిన్నలా తిడుతుంటే ఎందుకు ఊరుకున్నావు?)

     Banging = దులిపేయడం.

Niraj: I felt like bashing his head against the wall. But I held myself back because I did not want to make a scene in public.

(అతడిని గోడకేసి కొట్టాలనిపించింది. కానీ నన్ను నేను తమాయించుకున్నా. అందరి ముందూ పెద్ద గొడవను సృష్టించడం ఇష్టంలేక ఊరుకున్నా.)

b) Shanmukh: You are lucky. The auto driver was good enough to return your money back to you.

(నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. ఆటో డ్రైవర్ నీ డబ్బును నీకు తిరిగి తెచ్చిచ్చాడు.)

Sarath: Really. He held himself back from keeping the money for himself.

(నిజమే. అతడు డబ్బు తీసుకోకుండా, నిగ్రహం ప్రదర్శించాడు. గొప్పవాడే.)

7. Play Safe = Not to take risks (రిస్క్ తీసుకోకుండా ఉండటం.)

a) Ramesh: Why does the government have the food security bill in the PARLIAMENT?

(ప్రభుత్వం ఆహార భద్రతా బిల్లును పార్లమెంటులో ఎందుకు చర్చకు తేవడంలేదు?)

Surya: The government wants to play safe as the opposition parties may not accept it in its present form.)

(ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకుంటోంది. ప్రతిపక్షాలు ఆ బిల్లును ప్రస్తుతమున్న రూపంలో వ్యతిరేకిస్తున్నాయి.)

b) Sujana: How about going by train?

(రైల్లో వెళితే ఎలా ఉంటుంది?)

Anushka: We have to risk of not being able to reach on time. Let's play safe by taking a taxi.

(అక్కడికి సకాలానికి చేరలేకపోయే ప్రమాదం ఉంది. రిస్క్ లేకుండా టాక్సీలో వెళదాం.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌