• facebook
  • whatsapp
  • telegram

Let down, Look after

Let down, Look after అనే వ్యక్తీకరణలను విన్నారా? ఇవి ఒకరకంగా పరస్పర విరుద్ధమైనవి. ఈ expressions అర్థం ఏమిటో, సంభాషణల్లో ఎలా ప్రయోగించాలో తెలుసుకుందాం!

Krishna: Hi Jayanth, what news? Hope you are faring well. (జయంత్‌, ఎలా ఉన్నావు? నువ్వు క్షేమంగానే ఉన్నావనుకుంటా)

Jayanth: We met only yesterday. We saw each other and discussed something that is important. (నిన్ననే కదా మనం కలుసుకున్నది. మనం ఇద్దరం కలుసుకుని ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించాం.)

Krishna: Oh, I really forgot. Prabhakar let me down yesterday. He left immediately and did not answer me what he will do. (ఓ, నేను నిజంగా మర్చిపోయా. ప్రభాకర్‌ నన్ను నిన్న సరిగా సమర్థించలేదు. అతను వెంటనే వెళ్ళిపోయి, నాతో ఏ విషయమూ చెప్పలేదు, తానేెం చేయబోతున్నాడో.)

Jayanth: Prabhakar is a nice guy. He looked after me very well and took care of me. (ప్రభాకర్‌ మంచివాడేనే. నన్ను బాగా చూసుకుంటాడు, నా గురించి జాగ్రత్త తీసుకుంటాడు)

Krishna: I do not know how he could find what I was able to do. He told me that I was not good at all and that I had cheated him. (నాకు తెలీదు, నేను చేస్తున్న విషయం తనకు తెలీదని చెప్పాడు. అతను నాతో అన్నాడు, నేను తనను మోసం చేశానని)

Jayanth: Prabhakar is not that sort of guy. He is always very reliable. I find him very helpful in whatever way he helps me. (ప్రభాకర్‌ అటువంటివాడు కాడే. అతడు నాకు చాలాసార్లు సాయం చేశాడు.)

Krishna: I don't find him so. He is always very unreliable. Perhaps he helps you a lot. (నీకతను సాయం చేస్తాడనుకుంటా).

Jayanth: I always depend on him, and I count on him to help me. (నేనెప్పుడూ అతని మీద ఆధారపడతా. అతడు నాకెప్పుడూ సాయం చేస్తాడు)

Notes:

1) Cheat = deceive (మోసం చేయటం)

2) depend = rely on (ఆధారపడటం)

3) Reliable = Dependable. (ఆధారపడదగిన)

Look at the following words from the conversation

1) Prabhakar let me down yesterday. Let down = Fail to support or help. (నన్ను సమర్థించకుండా, సాయం చేయకుండా వదిలేశాడు)

Krishna: How did you find Dinakar? Is he reliable? I find that he is undependable. (దినకర్‌ ఎలాంటివాడు? అతను ఆధారపడదగ్గ మనిషేనా? అతను నాకు ఆధారపడ్డదగ్గ వ్యక్తి కాదని అనిపిస్తాడు)

Subhakar: Dinakar is always reliable. He certainly helps you in times of need never lets you down. (దినకర్‌ ఎప్పుడూ ఆధారపడదగ్గ వ్యక్తి. అతనెప్పుడూ నీకు సాయం చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టడు)

2) Look after = Take care of (మన గురించి ఒకరు జాగ్రత్త తీసుకోవటం)

Narasimham: Dayakar's sister always takes care of her younger brother. She takes good care of him always. (దయాకర్‌ వాళ్ళ అక్కయ్య తన తమ్ముడిని గురించి ఎప్పుడూ జాగ్రత్త తీసుకుంటుంది. అతన్ని ఎప్పుడూ శ్రధ్ద్ధగా చూస్తుంది)

Ramarao: Yes, his elder sister is very good. She always looks after him (అతని అక్క చాలా మంచిది. ఎప్పుడూ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది)

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌