• facebook
  • whatsapp
  • telegram

Dribs and drabs

ఏదైనా భాషపై పట్టు సాధించాలంటే దానిలో వచ్చే కొత్త వ్యక్తీకరణలపైనా దృష్టిపెట్టాలి. Dribs and drabs, Expatiating ఆ కోవకు చెందినవే. వీటి అర్థాలూ, వాటిని వ్యక్తీకరణల్లో ఉపయోగించే విధానాన్నీ తెలుసుకుందాం.

Jayaram: I just do not know why Madhavarao paid dribs and drabs to his cousin. They are very small amounts which Madhavarao spent on his priority amounts. (మాధవరావు తన కజిన్‌కు చిన్న మొత్తాలను ఎందుకు ఇచ్చాడో తెలీడం లేదు. అవి చాలా చిన్న మొత్తాలు. వాటిని మాధవరావు తన ముఖ్యమైన పనులకు ఖర్చు పెట్టుకుంటాడు.)

Narasimham: I don't understand why he paid such small amounts to his cousin. They are of no use to Madhavarao. (మాధవరావు తన కజిన్‌కు ఎందుకంత చిన్న మొత్తాలు ఇచ్చాడో నాకర్థం కావడం లేదు. వాటి వల్ల మాధవరావుకు ఎలాంటి ఉపయోగం లేదు).

Jayaram: Madhavarao was interested in paying his cousin very small amounts of money. His cousin told him to pay a heavy amount which Madhavarao did not do. (తన కజిన్‌కు చాలా చిన్న మొత్తాలు చెల్లించడమే మాధవరావుకు ఆసక్తి. తనకు పెద్ద మొత్తాన్ని ఇవ్వమని కజిన్‌ చెప్పినప్పటికీ మాధవరావు ఇవ్వలేదు).

Narasimham: Madhavarao is quite hoity-toity and knows how to torment his cousin. (మాధవరావు చాలా పొగరుబోతు, తన కజిన్‌ను ఎలా బాధించాలో బాగా తెలుసు.)

Jayaram: He is very good at teasing his cousin and never treats him politely. (అతడికి తన కజిన్‌ను ఏడిపించడం బాగా తెలుసు, అతడిని ఎప్పుడూ గౌరవంగా చూడడు.)

Narasimham: That is the trouble with him. He is very good at expatiation. (అదే అతడితో చిక్కు. కానీ, ఏ విషయాన్నైనా చక్కగా వివరించగలడు).

Jayaram: He knows how to trouble his cousin and always teases him. He is that sort of person. (అతడు తన కజిన్‌ను చాలా హింసిస్తాడు, ఎప్పుడూ నస పెడుతుంటాడు. అతడు ఆ రకమైన మనిషే).

Look at the following words from the conversation

Notes:

1) Priority = Being treated as more important than the other (ఒకదాని కంటే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం)

2) Hoity-toity = Arrogant (పొగరుబోతు)

3) Teasing = make fun of someone in a playful way (ఎవరినైనా ఆటపట్టించడానికి ఎగతాళి చేయడం)

1) Dribs and drabs = very small amounts of money (చాలా చిన్న మొత్తంలో డబ్బులు)

Ramarao: I do not know why Sankara Rao paid such small amounts of money to his cousin. They are not at all sufficient for his books and he had to borrow money from others. (శంకరరావు తన కజిన్‌కు ఎందుకు అంత తక్కువ డబ్బులు ఇచ్చాడో తెలియడం లేదు. అవి పుస్తకాలకే సరిపోవడం లేదు, దాంతో ఇతరుల నుంచి డబ్బులు అప్పు తీసుకున్నాడు.)

Sekhar: Sankara Rao is always miserly. He did not pay his cousin enough money to buy books. He gave him dribs and drabs and asked him to be satisfied with it. (శంకరరావు ఎప్పుడూ పిసినారే. అతడు తన కజిన్‌కు పుస్తకాలు కొనుక్కోడానికి తగినంత డబ్బులు ఇవ్వలేదు, అతడికి చిన్న మొత్తంలో డబ్బులు ఇచ్చి, దాంతో తృప్తిపడమన్నాడు.)

2) Expatiating = Move/wander about intellectually (మేధస్సుతో పనిచేయడం)

Narayana Rao: Ananda Rao is very good at wandering about intellectually. He is very good at any subject. (ఆనందరావు మేధస్సుతో చాలా పనులు చేస్తాడు. అతడు ఏ విషయంలోనైనా నిష్ణాతుడే).

Srinivasa Rao: He is quite good at expatiating any subject. He is a highly intellectual person and knows how to answer any question.

(ఏ విషయాన్నైనా చెప్పడంలో అతడు చాలా నేర్పరి. చాలా మేధస్సు గల వ్యక్తి, ఏ విషయాన్ని ఎలా విశదీకరించాలో అతడికి బాగా తెలుసు.)

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌