• facebook
  • whatsapp
  • telegram

Cheat ... Back up

రాతల్లో, సంభాషణల్లో Phrasal verbs ను సందర్భోచితంగా ఉపయోగిస్తే మనసులోని విషయాలను ఎదుటివారికి ప్రభావవంతంగా చెప్పవచ్ఛు ఇప్పుడు Back up అనే Phrasal verbను ఎలా ఉపయోగించాలో ఉదాహరణల సాయంతో చూద్దాం.

Jayasankar: We met yesterday, and we are meeting again today. Any news from Srinivas? (మనం నిన్న కలుసుకున్నాం. మళ్ళీ ఈ రోజు కలుసుకుంటున్నాము. శ్రీనివాస్‌ దగ్గరనుంచి ఏమైనా వార్తలు తెలిశాయా?)
 

Sreedhar: No news at all. He is often very silent and does not talk to us. He is that way very quiet. He doesn't talk much to his friends, and he always talks very little. (ఏం వార్తలూ లేవు. అతను ఎప్పుడూ మౌనంగా ఉంటాడు, మనతో ఎక్కువగా మాట్లాడడు. తన స్నేహితులతో ఎక్కువగా మాట్లాడడు, చాలా తక్కువగా మాట్లాడతాడు)
 

Jayasankar: You know, Badri in his math test cheated the teacher and the teacher did not notice that at all. (నీకు తెలుసా, బద్రి తన లెక్కల పరీక్షలో టీచర్‌ని మోసం చేసి, మార్కులు కొట్టేశాడు. ఆ టీచర్‌ అతని మోసాన్ని కనిపెట్టలేకపోయాడు)
 

Sreedhar: That is true. You know, I am not going to do my job any more. My wife backed me up over my decision to quit the job. (అది నిజమే. అన్నట్టు- నీకు తెలుసా, నేను నా ఉద్యోగాన్ని మానేస్తున్నాను. నా భార్య నేను ఉద్యోగం వదలాలనే నిర్ణయాన్ని బలపరిచింది)
 

Jayasankar: Why did she do so? It is a very good job and you are getting a fat salary. Why do you want to quit the job? (ఆమె ఎందుకలా చేసింది? అది నీకు చాలా మంచి ఉద్యోగం, నీకు చాలా మంచి జీతం వస్తుంది. ఎందుకు నువ్వా ఉద్యోగాన్ని వదిలివేయాలనుకుంటున్నావు?)
 

Sreedhar: She does not like the job, because I often come late to home, and she wants me to find another job. She is not at all happy about my job and wants me quit the job. (ఆమెకు ఈ ఉద్యోగం అసలు ఇష్టం లేదు, ఇంటికి తరచూ ఆలస్యంగా వస్తున్నానని. నన్ను ఇంకో ఉద్యోగం వెదుక్కోమంటోంది. నన్నీ ఉద్యోగం మానేయమంటోంది)
 

Jayasankar: You are getting a fat salary, man. Why do you want to quit the job? (అయ్యో, నీకు మంచి జీతం వస్తోంది. ఎందుకు నువ్వీ ఉద్యోగం మానేయాలనుకుంటున్నావు?)
 

Sreedhar: Any way, my wife wants me to quit the job and find another job which will close by 5 in the evening and I can return home. (ఏదయినా సరే, మా ఆవిడ నన్నీ ఉద్యోగం మానేయమంటోంది. ఇంకో ఉద్యోగం వెదుక్కోమంటుంది, అయిదింటికల్లా ఇంటికి తిరిగి వచ్చేసేటట్టు.)
 

Jayasankar: If that is what you think, it is very easy for you to quit the job. (అదే నువ్వు అనుకుంటూంటే, నువ్వా ఉద్యోగం సులభంగా మానేయవచ్చు)
 

Look at the following words from the conversation
 

1) Cheat = Deceive (మోసం చేయటం)
 

Venkat: You know, our friend Vinod has found the math teacher very good and he deceived him in the math test. (నీకు తెలుసా, మన స్నేహితుడు వినోద్‌, లెక్కల టీచర్‌ చాలా మంచివాడని గ్రహించి, లెక్కల పరీక్షలో ఆయనను మోసం చేశాడు)
 

Lakshmikanth: He is very good at such things. He cheated the math teacher and got very good marks in the exam. (అతనలాంటి విషయాల్లో చాలా గొప్ఫ లెక్కల టీచర్‌ని మోసం చేసి పరీక్షలో చాలా మంచిమార్కులు సంపాదించుకున్నాడు)
 

2) Back up = Support (సమర్థించటం)
 

Jayaram: My wife is no longer satisfied with my job. She wants me to quit the job and find another job. (నా భార్య నా ఉద్యోగ విషయంలో తృప్తి పడటం లేదు. ఆమె నన్ను ఈ ఉద్యోగం వదిలేయమనీ, ఇంకో ఉద్యోగం చూసుకోమనీ చెప్తోంది)
 

Sundar: I do not understand why she wants you to quit the job. You are getting a fat salary, and that will help your sons to continue their education. Your wife wants to back you up to quit the job (నాకర్థం కావటం లేదు, నిన్నెందుకు ఆ ఉద్యోగం వదిలేయమంటుందో, నువ్వు గొప్ప జీతం పొందుతున్నావు, నీ పిల్లల చదువులు కొనసాగటానికి అది సహాయపడుతుంది. నీ భార్య ఉద్యోగం వదిలెయ్యటాన్నే సమర్థిస్తోంది).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌