• facebook
  • whatsapp
  • telegram

To cool one's heels,  To tag along

Janakiram: Hi Yasvanth, how are things going? By the way, has your cousin got the job he has applied for? (హాయ్‌ యశ్వంత్‌, ఎలా ఉన్నావు? అది సరేకానీ మీ మామయ్య కొడుక్కు తను దరఖాస్తు చేసిన ఉద్యోగం వచ్చిందా?)

Yasvanth: Not yet. He has to cool his heels till he gets the call for the interview. That may take another 15days (ఇంకాలేదు. ఇంటర్వ్యూకు పిలుపు వచ్చేదాకా కాచుకు కూర్చోవాలి. అది ఇంకా 15 రోజులు పట్టవచ్చు).

Janakiram: IsnÕt he the best they can get? Why are they putting off recruiting him? (అతనికంటే మంచి అభ్యర్థి వాళ్లకు దొరుకుతాడా? ఎందుకు అతడిని నియమించడం వాయిదా వేస్తున్నారు?)

Yasvanth: He is sure to be taken. The interview is just a formality. They cannot do without him (అతన్ని కచ్చితంగా తీసుకుంటారు. ఇంటర్వ్యూ అనేది లాంచనం మాత్రమే. అతను లేకుండా వాళ్లేం చేయలేరు).

Janakiram: I think his brother is tagging along with him for the interview. There is another vacancy of a lower rank and his brother is trying for that (వాళ్ల తమ్ముడు కూడా అతనితో వెళ్తున్నాడు అనుకుంటా. వాళ్ల అన్న ఉద్యోగానికంటే తక్కువదాంట్లో ఖాళీ ఉంది, అతని తమ్ముడు దానికోసం ప్రయత్నిస్తున్నాడు).

Yasvanth: Usually his brother hangs out with his friends. I thought he was not serious about a job. But now I change my opinion (వాళ్ల తమ్ముడు ఎప్పుడూ స్నేహితులతో గడుపుతుంటాడు. ఉద్యోగం విషయం అతనికి పట్టదనుకుంటూ ఉండేవాడిని. కానీ నా అభిప్రాయం ఇప్పుడు మార్చుకుంటున్నా).

Janakiram: I am sure they would get the jobs. They are brilliant (వాళ్లకా ఉద్యోగాలు వస్తాయని నా గట్టి నమ్మకం. వాళ్లిద్దరూ బాగా తెలివైన వాళ్లు).

Yasvanth: So, what happened to your project work? Have you finished it? (నీ ప్రాజెక్టు వర్కు ఏమైంది? దాన్ని పూర్తిచేశావా?)

Janakiram: My boss did not approve of it when he saw it yesterday. So, it is back to the drawing board (మా బాస్‌ దాన్ని ఆమోదించలేదు, అతను నిన్న దానిని చూసినప్పుడు. అందుకని అది మళ్లీ మొదటికొచ్చింది).

Yasvanth: All the best then, bye (నీకంతా మంచే జరగాలని నా కోరిక. వస్తా మరి).

Look at the following sentences from the conversation above:

1. To cool one's heels = to be kept waiting (వేచి ఉండేలా చేయడం).

a) Bhema Rao: I called at your home yesterday. But I was told you had gone out. Where did you go? (నిన్న మీ ఇంటికి వచ్చాను. నాకు చెప్పారు, నువ్వు బయటికి వెళ్లావని. ఎక్కడికి వెళ్లావు?)

Rathnam: I went to the doctor because of my throat trouble. I had to cool my heels there for almost an hour. By the time I returned home it was 11 in the morning (నాకు గొంతేదో బాధగా ఉంటే డాక్టర్‌ దగ్గరికి వెళ్లాను. అక్కడ నేను దాదాపు గంటసేపు వేచి ఉండాల్సి వచ్చింది. నేనింటికి తిరిగి వచ్చేటప్పటికి ఉదయం 11 గంటలైంది).

b) Vasudev: The prograamme yesterday was very entertaining, though it started late (నిన్నటి కార్యక్రమం చాలా వినోదభరితంగా ఉంది, కొంత ఆలస్యంగా మొదలైనప్పటికీ).

Nagaraj: But we had to cool our heels for almost half an hour before the programme started. We, Indians, lack promptness (కానీ మనం అరగంట కూర్చోవాల్సి వచ్చింది, ఆ కార్యక్రమం మొదలయ్యేటప్పటికి. మనలో ఉన్న లోపమే అది- సకాలంలో చేయకపోవడం).

2. To tag along = to accompany somebody (ఎవరితోనైనా కలిసి వెళ్లడం).

a) Madhav: Did you get the chance yesterday to talk to your uncle alone? (నిన్న మీ బాబాయితో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరికిందా?)

Sankar: Of course, no. his wife always tags along with him, wherever he goes, except to his work (దొరకలేదు. ఆయన భార్య ఒక్క పనికి వెళ్లినపుడు తప్ప ఎప్పుడూ ఆయనతోనే వెళ్తూ ఉంటుంది).

b) Anand: I am on my way to the cinema. I am looking for company (నేను సినిమాకి వెళ్తున్నాను. ఎవరైనా నాతో వస్తే బాగుండనిపిస్తోంది).

Prakash: Mind if I tag along? I have nothing to do now (నేను నీతో కలిసి వస్తే నీకైమేనా అభ్యంతరమా? ఇప్పుడు నాకేం పని లేదు).

3. Back to the drawing board = beginning a plan from the beginning once again (పథకాన్ని మళ్లీ ప్రారంభించడం).

a) Janakiram: Has your plan for the project been approved? Did they pay you the money they promised to pay? (ప్రాజెక్టుకు నువ్వు వేసిచ్చిన పథకం ఆమోదం పొందిందా? వాళ్లు నీకు ఇస్తామన్న డబ్బు చెల్లించారా?)

Simhadri: I was afraid they wouldnÕt be happy with my plan, so, it would be back to the drawing board. Fortunately, they accepted it (నాకనిపించింది, వాళ్లు నా పథకంతో సంతోషపడరని, అందుకని దానిని మళ్లీ వేరేగా ప్రారంభించాను. అదృష్టవశాత్తూ దానిని వాళ్లు స్వీకరించారు).

b) Nataraj: What happened to your plans for a trip to Kashmir, and other parts of North India? (కశ్మీర్‌కు ఉత్తర భారతంలోని కొన్ని చోట్లకు నువ్వు వెళ్లాలనుకున్న పథకం ఏమైంది?)

Sanmukh: The way I planned it was too expensive. So, it is back to the drawing board. I have to work out a method to reduce the expenditure (నేను మొదట వేసుకున్న పథకం ప్రకారం మరీ ఎక్కువ ఖర్చు అయ్యేట్లు అనిపించింది. అందుకని అది మళ్లీ మొదటికొచ్చింది, మళ్లీ వేరే ఆలోచన చేయాల్సి వచ్చింది. ఏదైనా మార్గం చూడాలి ఖర్చులను తగ్గించడానికి).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌