• facebook
  • whatsapp
  • telegram

Runs short of

ఇతరులకు చెప్పటానికి ఇబ్బందిపడే విషయాలను దాచేస్తుంటాం. ఈ వ్యక్తీకరణను శక్తిమంతంగా సూచించే phrasal verb ఒకటుంది. దాన్ని నేర్చుకుందాం!
 

Srinivas: Hi Ramanath, any interesting news? (ఆసక్తికరమైన విషయాలేమైనా ఉన్నాయా?)
 

Ramanath: We just met yesterday. What interesting news could be there between yesterday and today? (నిన్ననే కదా మనం కలుసుకున్నది, నిన్నటికీ ఈరోజుకీ మధ్య ఏ విషయాలు ఉంటాయి?)

Srinivas: Did Prabhakar approach you for money? He asked me to help him by lending him some money. I have lent him too often and he hasn't repaid the amounts so far. So I told him I don't have enough to lend him. (ప్రభాకర్‌ నీ దగ్గరికి డబ్బు కోసం ఏమైనా వచ్చాడా? అతడికి నేను చాలాసార్లు అప్పిచ్చాను. కానీ ఇంతవరకు, అది తిరిగి ఇవ్వలేదు. అందుకని నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను)
 

Ramanath: I don't know why he always runs short of money. He often approaches either you or me for money. He hasn't repaid the money he has borrowed four or five times from me. (ఎందుకతనికి డబ్బు కొరత ఉంటుందో అర్థం కాదు. తరచూ నీ దగ్గరకో నా దగ్గరకో డబ్బు కోసం వస్తుంటాడు. నా దగ్గర తీసుకున్న అప్పు ఇంతవరకూ తీర్చలేదు)
 

Srinivas: The trouble is he doesn't tell us why he needs so much money. I think he drinks a lot and that might be the reason for his need for money. (సమస్య ఏమిటంటే ఎందుకతనికి డబ్బు అవసరమో చెప్పడు. తాగుతాడనుకుంటా. ఆ కారణం వల్ల అతడికి డబ్బు అవసరం)
 

Ramanath: He does not reveal it to us. He sweeps the dust under the carpet and does not let us know about his habit. (అది అతడు మనకు చెప్పడు. తన అలవాటు విషయంలో గుట్టును దాచుకుంటాడు)
 

Srinivas: It is better we don't help him to drink. ( మనం అతనికి సాయం చేయకుండా ఉండటమే మంచిది)
 

Now look at the following phrasal verbs from the conversation
 

1) Runs short of - the original form: run short of = Use up almost all of something a person has; too little left with them. (ఉన్న డబ్బంతా అవజేయటం, మన దగ్గర చాలినంత లేకపోవటం)
 

Sitharam: Have you any money to lend me? As soon as my father sends me money I will repay it. (నాకు అప్పివ్వటానికి నీ దగ్గర డబ్బేమైనా ఉందా? మా నాన్న డబ్బు నాకు పంపగానే నేను నీకు తిరిగిచ్చేస్తాను)
 

Vinai: I am sorry; I am running short of money too. The trouble is, when it comes to money we are always running short. (సారీ, నా దగ్గర కూడా చాలినంత డబ్బు లేదు. అసలు సమస్య ఏమిటంటే.. డబ్బు విషయానికి వస్తే మనకెప్పుడూ తక్కువగానే ఉంటుంది)
 

Sekhar: Our friend Someswar is very secretive. He never lets us into his secrets. (మన సోమేశ్వర్‌ ఎప్పుడూ రహస్యంగానే ఉంటాడు. తన రహస్యాలనెప్పుడూ మనకు చెప్పడు)
 

Subhani: He is very good at sweeping the dust under the carpet. He never lets us know what he is up to. (సిగ్గుపడే సంగతులు దాచటం అతనికి అలవాటే. అతడు ఏ సమయంలో ఏ పని చేస్తాడో మనకు చెప్పడు)

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌