• facebook
  • whatsapp
  • telegram

No  Verb ... No  Sentence 

Mukund: I am happy today. The books are here. This book with the green cover is more interesting than the other two books.

(ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకాలు ఇక్కడున్నాయి. పచ్చ అట్టతో ఉన్న ఈ పుస్తకం మిగతా రెండింటి కంటే ఆసక్తికరంగా ఉంది.)  

    

Govind: Yes. I have read it. It is about Einstein, the great scientist. It is a biography, but is more like a story.

Mukund: I am an admirer of Einstein and so are you, I think. Einstein himself was a great admirer of Gandhi. The two were really great men.  

(నేను ఐన్‌స్టైన్ అభిమానిని. నువ్వు కూడా అనుకుంటా. ఐన్‌స్టైన్ గాంధీ అభిమాని. ఆ ఇద్దరూ చాలా గొప్పవాళ్లు).  (అవును. నేను దాన్ని చదివాను. అది ఐన్‌స్టైన్ అనే గొప్ప శాస్త్రవేత్తను గురించి. అది జీవితచరిత్రే. కానీ అదో కథలా ఉంది.)

 

  Admire = మెచ్చుకోవడం, అభిమానించడం.

 Admirer = అభిమాని = fan

Govind: Most people are full of respect for the two. They were such geniuses.

(చాలామందికి ఆ ఇద్దరంటే అభిమానం. అలాంటి మేధావులు వాళ్లు).

Mukund: Einstein is famous for his scientific discoveries. Gandhi is famous for his discovery of peace and non-violence as a weapon against Britishers.

(సైన్స్‌లో కొత్త విషయాలు కనుక్కుని ఐన్‌స్టైన్ ప్రసిద్ధికెక్కాడు. అలాగే గాంధీ కూడా బ్రిటిషర్లను అంతమొందించేందుకు శాంతి, అహింస అనే ఆయుధాలు కనిపెట్టి ప్రసిద్ధికెక్కాడు.)  

                    famous = ప్రసిద్ధి చెందిన/ పేరున్న 

                    fame = ఖ్యాతి/ ప్రసిద్ధి 

                    Violence = హింస / దౌర్జన్యం 

Govind: That's why the world is grateful to them.

(అందుకే ప్రపంచం వాళ్లకెప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది.)

Greatful = కృతజ్ఞత ఉన్న                    Non-violence = అహింస

                                   * * * 

తెలుగు వాక్యంలో word order (ఏ మాట ముందు, ఏ మాట తర్వాత అనేది) కు, English sentence లో word order కూ చాలా తేడా ఉంటుందని కిందటి lesson లో చూశాం కదా?

తెలుగు వాక్యంలో సామాన్యంగా ఏ మాటను ఎటు మార్చినా అర్థం మారదు.

e.g..: గోవింద్ పామును చంపాడు.

ఈ వాక్యంలో మాటల positionను ఎటు మార్చినా అదే అర్థం వస్తుంది.

చూడండి...

పామును గోవింద్ చంపాడు

చంపాడు పామును గోవింద్

గోవింద్ చంపాడు పామును 

         ఇలా ఏ మాట ఎక్కడున్నా వాక్యం అర్థం మారదు. కానీ English లో అలాకాదు. ఉన్నచోటి నుంచి మాటను మారిస్తే అర్థం మారిపోతుంది.

చూడండి:

 Govind killed a snake = గోవింద్ పామును చంపాడు

A snake killed Govind= పాము గోవింద్‌ను చంపింది. 

        చూశారు కదా? ఎంత తేడా ఉందో. అందుకే English లో word order in a sentence is very important  
 

* English లో statement (ఏదైనా ఒక విషయం చెప్పే sentence) కూ, Question (ప్రశ్న)కూ word order లో చాలా తేడా ఉంటుంది.

 Statement:     He is        here (అతనిక్కడ ఉన్నాడు.)

              Subject  +  Verb

అంటే statement లో ఎప్పుడూ subject ముందు, దాని తర్వాత verb వస్తాయి.

Question:     Is           he         here? (అతడిక్కడ ఉన్నాడా?)

               Verb    +   Subject

 ఇది ఇంతకు ముందు lesson లో చూశాం కదా?     

ఇప్పుడిది గమనించండి:

English లో verb చాలా ముఖ్యం. తెలుగులో చాలావరకు verb అంతగా వాడం.

Look at the following.

Ram is Mukund's friend.

అర్థం: రామ్, ముకుంద్ స్నేహితుడు. 

Ram is Mukund's friend అనడంలో, Ram subject, is verb కదా? తెలుగు వాక్యంలో చూడండి: Ram కు, రాం అని ఉంది, Mukund's friend కు ముకుంద్ స్నేహితుడు అని ఉంది. కానీ English లోని is (verb) కు తెలుగులో ఏ మాటాలేదు కదా! ఇలా తెలుగులో verb ను మనం అంతగా పట్టించుకోం . 

'రాం, ముకుంద్ స్నేహితుడు' అంటామే కానీ రాం, ముకుంద్ స్నేహితుడిగా ఉన్నాడు (= is) అనము. 

Dasaradha is Sri Rama's father

(దశరథుడు శ్రీరాముడి తండ్రి) (is = ఉన్నాడు) తెలుగులో 'is' కు ప్రాముఖ్యం ఇవ్వం. కానీ ఇంగ్లిష్‌లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. verb లేనిదే sentence ఉండదు.

Now look at the following sentences from the conversation (సంభాషణ) at the beginning of the lesson.

1. The books are here

2. It is about Einstein

3. I am an admirer of Einstein

4. It is a biography, but it is more like a story.

5. I am an admirer of Einstein

6. Einstein himself was an admirer of Gandhi

7. The two were really great men

* The words am, is, are, was and were, underlined above are all verbs.

1. The books are here= పుస్తకాలిక్కడ ఉన్నాయి.

2. It is about Einstein= అది ఐన్‌స్టైన్ ను గురించి.

చూశారా తెలుగులో Einstein ను గురించి, అని వదిలేస్తాం. కానీ English sentence లో is అనే verb లేకపోతే తప్పు. అలాగే

3. I am an admirer of Einstein = నేను ఐన్‌స్టైన్ అభిమానిని - ఇక్కడ కూడా English లో am (ఉన్నాను) కు తెలుగు లేదు.

4. It is a biography, but it is more like a story.

    అది జీవిత చరిత్రే. (is తెలుగులో = ఉంది. తెలుగులో వాడం) కానీ కథలా ఉంది. (is)

5. I am an admirer of Einstein = నేను ఐన్‌స్టైన్ అభిమానిని - అంటే చాలు. am కు కూడా తెలుగు చెప్తే, గా ఉన్నాను అనాలి. కానీ అలా అనం కదా.

6. Einstein was an admirer of Gandhi = ఐన్‌స్టైన్ గాంధీ అభిమాని. (గా ఉండేవాడు = was)

7. The two were really great = ఆ ఇద్దరూ నిజంగా గొప్పవాళ్లు (గా ఉండేవాళ్లు = were)

ఇంకో విషయం. English లో verb ఎప్పుడూ, subject వెంటే ఉంటుంది. తెలుగులో ఎక్కడ ఉన్నా ఫరవాలేదు. కానీ ఎక్కువగా వాక్యం చివర వస్తుంది.

Now, in the sentences below, point out the sentences in which Telugu words for English am, is, are, was and were are omitted.

(కింది English sentences లో am, is, are, was, were లకు మాటలు తెలుగులోని sentences ను గుర్తించండి)

1. We are Indians.

2. Are you an actor?

3. The books are on the table

4. My friends are all in jobs.

5. Where is he?

6. Why are you here?

7. We were in Chennai yesterday?

8. His books were here an hour ago

9. The movie was good. 

Answers 

1. మనం భారతీయులం - are కు ఇక్కడ తెలుగు మాట లేదు.

2. నువ్వు నటుడివా? - 'is' కు తెలుగు లేదు

3. పుస్తకాలు table మీద ఉన్నాయి - ఇక్కడ ఉన్నాయి = are

4. మా స్నేహితులందరూ ఉద్యోగాల్లో ఉన్నారు (ఇక్కడ ఉన్నారు = are)

5. Where is he? అతనెక్కడ? - is తో కలిపి, అతనెక్కడ ఉన్నాడు (is)? అనాలి, కానీ అతనెక్కడ? అని ఆపేస్తాం. (is = ఉన్నాడు అనేది వదిలేస్తాం)

6. Why are you here? (నువ్వెందుకున్నావిక్కడ? - are ఉన్నావు)

7. మేం నిన్న చెన్నైలో ఉన్నాం - were = (గతంలో) ఉన్నాం

8. అతడి పుస్తకాలు గంట ముందు ఇక్కడ ఉన్నాయి.

were = గతంలో ఉన్నాయి - were తెలుగులో

9. ఆ సినిమా బాగుండింది (was = ఉంది)

మనం నేర్చుకున్న విషయం: తెలుగులోలా Englishలో, ఉన్నాయి, ఉంది, ఉన్నాం etc తెలిపే verbను వదిలేయడానికి వీల్లేదు.

ప్రతి English sentenceలో verb ముఖ్యం.

కింది verbను గురించి తెలుసుకోండి

Am/is/ are= ఉండటం - ఇప్పుడు (Now), ఎప్పుడూ (always), క్రమం తప్పకుండా (Regularly).

I am/ He, She, It  is/We, you, they  అంటే Am ఎప్పుడూ I తో, Is ఎప్పుడూ, He, she, it తో, are ఎప్పుడూ, we, you, they తో వాడతాం. ఇప్పుడూ, ఎప్పుడూ, క్రమం తప్పకుండా 'ఉండటం' అనే అర్థంతో. అలాగే was/were = past (గతంలో) ఉండటం.
I/ he/ she/ it - was

we/ you/ they - were. అంటే plural number కు were వాడతాం.

Am, is, are, was, were - ఈ verbs 'be' forms (ఉండటం - వివిధ కాలాల్లో అని అర్థం వచ్చే verb) లో కొన్ని ఇప్పుడు చూడండి:

a) I am at home (నేనింట్లో ఉన్నాను - ఇప్పుడు)

     I am at home on Sundays (అన్ని ఆదివారాలు/ ప్రతి ఆదివారం నేనింట్లోనే ఉంటాను (Regular)).

b) The Sun (it) is in the east in the mornings (ప్రతి ఉదయం సూర్యుడు తూర్పున ఉంటాడు. (Regular)).

c) My friend (he/ she) is at home (మా స్నేహితుడు/ స్నేహితురాలు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు/ ఉంది.)

d) The students are in class (విద్యార్థులు class లో ఉన్నారు (ఇప్పుడు)).

e) India was under British rule till 1947. (1947 వరకు భారత్ బ్రిటిష్ పరిపాలనలో ఉండేది (గతం)).

f) The British were our rulers till 1947.

    (1947 వరకు British వాళ్లు మన పాలకులుగా ఉండేవాళ్లు - గతం. British వాళ్లు, plural కాబట్టి, were)

g) I am not in Vijayawada (నేను విజయవాడలో లేను (ఇప్పుడు)).

h) Am I your enemy (నేను నీ శత్రువునా? Question కాబట్టి Am (verb) తర్వాత I (subject) వస్తుంది కదా?)

i) She is not a student

    (ఆమె విద్యార్థిని కాదు)

j) Is she not a student?

   (ఆమె విద్యార్థిని కాదా?)

   ఇక్కడ కూడా question కాబట్టి is (verb) తర్వాత she (subject).

k) Your books are not here

    (నీ పుస్తకాలిక్కడ లేవు - ఇప్పుడు)

l) Where are your clothes?

   (నీ దుస్తులెక్కడ ఉన్నాయి? - ఇప్పుడు)

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌