• facebook
  • whatsapp
  • telegram

 'Be' forms are Three types

Darsika: Where are your friends? Are they here? (మీ స్నేహితులెక్కడ? వాళ్లిక్కడ ఉన్నారా?). 

Deepika: They are. In fact they have been here for the past ten minutes. Is the coffee ready?

                    (ఇక్కడే ఉన్నారు. ఇప్పుడేంటి? గత పది నిమిషాలుగా ఇక్కడే ఉన్నారు. కాఫీ సిద్ధంగా ఉందా?)

       (In fact = ముందన్నదానికి, విరుద్ధంగా ఏదైనా అంటున్నప్పుడు/ యథార్థంగా అనే అర్థంతో వాడతాం.)

Darsika: They were here last Sunday too, weren't they?

                (వాళ్లు పోయిన ఆదివారం కూడా ఇక్కడ ఉన్నారు కదా?)

Deepika: Yea. They came here last Sunday to borrow some books from me. I gave them the books. They have come here to return the books.

                    (కిందటి ఆదివారం నా దగ్గర కొన్ని పుస్తకాలు (అరువు) తీసుకునేందుకు వచ్చారు. నేను వాళ్లకు ఆ పుస్తకాలిచ్చాను. ఇప్పుడు వాటిని తిరిగి ఇవ్వడానికి వచ్చారు.)

Darsika: They seem to be good. When will they be here again?

                   (వాళ్లు మంచివాళ్లుగా కనిపిస్తున్నారు. మళ్లీ ఎప్పుడుంటారిక్కడ?)

Deepika: They may be here next Sunday too. I shall be happy to have them here frequently.

                    (వచ్చే ఆదివారం కూడా వాళ్లిక్కడ ఉండవచ్చు. వాళ్లిక్కడ తరచూ ఉండటం నాకు సంతోషంగా ఉంటుంది.)

         Frequently (తరచుగా) ´ rarely (అరుదుగా).

Darsika: How far is their place from here? (వాళ్లిల్లు ఇక్కడికెంత దూరం?) 

                far (దూరం) ´ near (దగ్గర); how far? = ఎంత దూరం?

Deepika: Not very far; about a kilometre and a half. They can be here in 15 minutes if they walk.

                    (పెద్దదూరం ఏం కాదు. దగ్గర దగ్గర కిలోమీటరున్నర. నడిచి వస్తే 15 నిమిషాల్లో ఇక్కడ ఉండగలరు.)

Darsika: But they have a vehicle, don't they? If they come on it, it should take much less than that.

                  (వాళ్లకేదో వాహనం ఉన్నట్టుంది కదా? దానిమీదైతే ఇంకా తక్కువ సమయం పట్టాలి.)

Deepika:It does. Get the Coffee then. I will call them. (అవును. కాఫీ తీసుకురా. వాళ్లను పిలుస్తాను నేను.)

Look at the following sentences:

         1) They have been here for the past ten minutes.

         2) They came here last Sunday to barrow some books.

         3) I gave them the books.

         4) When will they be here again?

         5) They may be here again next week.

         6) I shall be happy.

         7) They can be here in ten minutes if they walk.

         8) It should take much less than that.

         9) I will call them.

                   పైన underline చేసిన మాటలన్నీ verbs. 

(Verbs అంటే గుర్తుంది కదా?

sentence లో Subjec తర్వాత sentence కు ఏమాట ముఖ్యమో అది verb.)

పై sentences లోని verbs చూద్దాం.    

ఇప్పుడు మీరు తెలుసుకునే విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకుని గుర్తుంచుకోండి.

ఇవి మీకు గుర్తుంటే English మాట్లాడటం సులభం అవటమే కాకుండా, confusion ఉండదు.

              పైన A కింద తెలిపిన verbs, 'Be' forms. వీటి చివర 'be'/ 'been' వస్తుంది గమనించండి.

ఇలా 'be'/ 'been' చివర వచ్చే verbs ను 'be' forms అంటాం. 'Be' forms అంటే ఉండటం అని అర్థం వచ్చే verbs. ఇంతకు ముందు చూశాం కదా? కొన్ని 'be' forms

1) am, is, are = ఇప్పుడు/ ఎప్పుడూ/ మామూలుగా/ సాధారణంగా ఉండటం.

2) was, were = గతంలో ఉండటం.

      B కింద తెలిపిన verbs అన్నీ 'Active words' అంటే పనిని తెలిపే పదాలు. చూడండి.

              e.g.: came = వచ్చాడు/ వచ్చాను/ వచ్చారు- పని. అంటే English లో రెండు రకాల verbs ఉన్నాయన్నమాట. 1) Be forms: అన్ని 'be' forms కు అర్థాలు 'ఉండటం' అనే దాని వివిధ రూపాలుగా ఉంటాయి. ఇవి మూడు sets గా ఉంటాయి.

Set - 1: Am, is, are, was, were

Set - 2: చివర 'be' వచ్చేవి. 


                                 

Set-3: చివర 'been' వచ్చేవి.                                  

పైవన్నీ వివిధ రకాల ఉండటాన్ని తెలుపుతాయి. అన్ని verbs.

        ఇప్పుడు B కింద తెలిపిన verbs చూడండి. ఇవి action words అంటే పనిని తెలిపేవి.

        borrow = అరువు తీసుకోవడం (పని - action word)

        gave = ఇచ్చాను/ ఇచ్చాడు/ ఇచ్చాం/ ఇచ్చారు (పని - action word). 

        walk నడవడం (పని - action word).

     should take = తీసుకోవాలి - (పని - - action word) will call -(భవిష్యత్‌లో) పిలుస్తాం (పని - action word) కాబట్టి, మనం ముఖ్యంగా తెలుసుకుని గుర్తుంచుకోవాల్సిన విషయం: English verbs - 2types - 1) Be forms = (ఉండటం అనే అర్థం వచ్చేవి) 

2) Action words (పనిని తెలిపేవి).

 'Be' forms:

a) Am, is are, was, were

b) చివర 'be' వచ్చే, shall be, should be, will be, would be లాంటివి.

c) చివర 'been' వచ్చే, have been, has been, had been, shall have been లాంటివి.

Actions words: పనిని తెలిపే మాటలు: Take, give, read, go, come లాంటివి.

స్థూలంగా: 'be' forms మనం ఉండే స్థితిని చెబుతాయి.

      Action words మనం చేసే పనిని తెలుపుతాయి. మళ్లీ మళ్లీ చెబుతున్నాం - గుర్తుంచుకోండి. చూడండి. Sachin is a cricketer - ఇక్కడ verb: is (ఉన్నాడు) - సచిన్ క్రికెటర్ (గా ఉన్నాడు) - ఇది ఉండటాన్ని తెలిపేది కాబట్టి, is అనే 'be' form వస్తుంది.

Sachin plays cricket - ఇక్కడ verb - plays = ఆడతాడు - పని. కాబట్టి ఇది actionword. 

     ఇప్పుడు అన్ని 'be' forms అర్థం - వాటి ఉపయోగం చూద్దాం. కేవలం 'be' formsనే వాడి English లో 30 శాతం conversation (సంభాషణ) నడిపించవచ్చు.

Am, is, are, was, were - ఈ 'be' forms గురించి ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా? ఇప్పుడివి చూడండి.

Shall be/ will be - future states of being (ముందు కాలంలో ఉండటం)

I shall be there tomorrow. (రేపు నేనక్కడ ఉంటాను.) 

He will be an Engineer soon. (అతడు త్వరలోనే ఇంజినీర్‌గా ఉంటాడు.) 

Modern English speech లోshall be వాడకం బాగా తగ్గిపోయింది. English వాళ్లు ఎక్కువగా will be ఉపయోగిస్తున్నారు.

There will be elections next year. (వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉంటాయి.)

ఈ lesson మొదట్లో ఇచ్చిన conversation లోని మాటలు చూద్దాం.

                When will they be here again?

                (వాళ్లు మళ్లీ ఇక్కడ ఎప్పుడుంటారు? (will be - be form))

Would be = గతంలోంచి భవిష్యత్‌లో ఉండే విషయం.

a) I will be there tomorrow (నేను రేపక్కడ ఉంటాను.)

b) I told them (వాళ్లతో గతంలో చెప్పాను) that I would be there (నేను అక్కడ ఉంటానని).

           Sentence (b)లో నేను చెప్పాను (గతంలో) అక్కడ ఉంటానని - ఇక్కడ would be = గతంలో అనుకునే భవిష్యత్ గురించి.

Should be = must be = have to be/ has to be = ఉండాలి.

You should be/ must be/ have to be at school by 10.

(పదింటికల్లా నువ్వు schoolలో ఉండాలి.)

She has to be at home by 8. (ఎనిమిదింటికల్లా ఆమె ఇంట్లో ఉండాలి.)

ఇది గమనించండి: Have = has

        అయితే I, we, you and they (వాళ్లు/ అవి)తో have అంటాం. He, She, It తో has అంటాం. 

ఇప్పటి వరకూ మనం verb ను గురించి తెలుసుకున్న విషయాలు 

   1) am/is/ are = ఉండటం,                                                                     

        ఇప్పుడు/ ఎప్పుడూ/ మామూలుగా

   2) Was/ were = గతంలో ఉండటం

   b) Shall be/ will be = భవిష్యత్ లో ఉండటం

   c) Would be - past future (గతం నుంచి భవిష్యత్ చెప్పేందుకు)

   d) Should be/ must be/ have to be/ has to be = ఉండాలి.
                

ఇప్పుడు ఈ Exercise చేయండి: ఇవన్నీ 'be' forms కు సంబంధించినవే.

pat the following English.

       1) అతడు ప్రతిరోజు ఇక్కడ ఉదయం ఏడింటికి ఉంటాడు. 

       2) ఫస్ట్ షో ప్రతిరోజు 6.15కు     

       3) వాళ్లెప్పుడుంటారు school లో? 

       4) మీ class ఎప్పుడు (ప్రతిరోజూ)? 

       5) మీరు రేపు అక్కడ ఉంటారా? 

       6) వచ్చే జూన్‌కు మీ వయసెంత (ఉంటుంది)? 

       7) నిన్న వాళ్లిక్కడ ఉన్నారా? 

       8) అతడు వచ్చే సంవత్సరానికి 20 ఏళ్లవాడిగా ఉంటాడు 

       9) అతడు పదింటికి ఇక్కడ ఉండాలి.

(గమనించండి - తెలుగుకూ English కూ ఉన్న తేడా:

           The book is on the table = పుస్తకం table మీద ఉంది. తెలుగులో Table తర్వాత 'మీద' వస్తోంది. కదా? English లో అది table ముందు, on (మీద) వస్తోంది కదా?)

Answers:

1) He is here at 7 every morning (Spoken English లో AM/ PM వాడం. Morning/ Evening etc అని అంటాం. సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు వాటినీ వదిలేస్తాం.)

* Our class is at 10 every day.

      సామాన్యంగా రాత్రి 10 గంటలకు తరగతులు ఉండవు కదా? అందుకే at 10 అంటే చాలు.

2) The first show is at 6.15 everyday.

      First, Second, Third etc ముందు, 'the' కచ్చితంగా వాడాలి

3) When are they at school?

      (Question కాబట్టి subject 'they' ముందు verb వస్తుంది.)

4) When is your class (every day)?

       ఇది కూడా question.

5) Will you be there tomorrow?

         Question లో రెండు, మూడు మాటలున్న verb వాడాల్సి వస్తే - [ఇక్కడిలా will be] - verb లో మొదటి మాట ముందు తర్వాత subject వస్తాయి.

6) What will be your age/ What will your age be by next June?

7) Were they here yesterday?

8) He will be 20 (Years old) next year.

9) He must be/ should be/ has to be here at 7.
 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌