• facebook
  • whatsapp
  • telegram

Almost..About..Around


Tharun: It's about time we started. It's already 6, and the show will be about to begin by the time we reach the venue.

(మనం బయల్దేరాల్సిన సమయం దాదాపు వచ్చేసింది. ఇప్పటికే 6 అయ్యింది, మనం ఆ స్థలానికి చేరుకునే సరికి దాదాపు ప్రదర్శన ప్రారంభమయ్యే సమయం అవుతుంది.)

Varun: What's the distance like? Around 25 km?

(దూరమెంత? సుమారుగా 25 కి.మీ. ఉంటుందా?)

Tharun: Not that far. It is 20 km odd from here. However, given the traffic on this route, it might take half an hour for us on the bike, give or take a few minutes.

(అంతదూరం ఉండదు. ఇక్కడ్నించి 20 కి.మీ. చిల్లర ఉంటుంది. అయితే ఈ మార్గంలోని రాకపోకలను బట్టి, మనం bike మీద అరగంటలో చేరుకుంటాం, కొన్ని నిమిషాలు అటూఇటుగా.)

Varun: You expect a good gathering, don't you? Will it be in thousands?

(జనం బాగానే వస్తారనుకుంటా! వేలల్లో ఉండవచ్చా?)

Tharun: It's being held in the open, you remember. An estimated 5000 are going to attend. That may be slightly on the higher side; there will be 4000 or thereabouts.

(అది ఆరు బయట జరగనుంది, గుర్తుంది కదా! 5000 మంది దాకా వస్తారని అంచనా. అది కొంచెం ఎక్కువే అనుకో. దాదాపు 4000 మంది ఉండవచ్చు.)

Varun: And what is the collection the show is expected to take in? Some lakhs of rupees?

(ఈ ప్రదర్శన వల్ల ఎంత పోగవుతుందని అనుకుంటున్నారు? కొన్ని లక్షలా?)

Tharun: It's a charity show, and the more the collection, the better for the beneficiaries. They put it some where in the region of two to three lakhs.

(ఇది సహాయం కోసం ఇస్తున్న ప్రదర్శన కదా! ఎంత ఎక్కువ వస్తే అంత లాభం, దీనివల్ల మేలు పొందేవాళ్లకు. 3 లక్షల దాకా రావచ్చని అంచనా వేస్తున్నారు.)

Varun: What are they going to pay the artists?

(కళాకారులకు ఎంత చెల్లిస్తారు?)

Tharun: Just the expenses. They are performing more or less for free.

(ఖర్చులు మాత్రమే. వాళ్లు ఉచిత ప్రదర్శన ఇస్తున్నారు.)

Varun: Do you think they will give out their best when they get next to nothing for the show?

(ప్రదర్శనకు ఏమీ ఇవ్వకపోతే వాళ్లు తమ ఉత్తమ ప్రదర్శన ఇస్తారంటావా?)

Tharun: I'm almost certain of it. They themselves offered to do it, on hearing the plight of the orphanage which they want to help. They wish to collect the figure required for the new buildings. (ఈ విషయంలో నేను దాదాపు కచ్చితంగా ఉన్నాను. అనాథ పిల్లల సహాయార్థం ఈ ప్రదర్శన ఇవ్వడానికి వాళ్లే ముందుకొచ్చారు. శరణాలయం బిల్డింగ్‌కు కావాల్సిన డబ్బు సేకరిస్తున్నారు.)

Varun: That's something. Let us contribute our mite.

(అది మంచిదే. మన చేతనైన సాయం మనం చేస్తాం.)

Look at the following sentences from the conversation above:

1) It is about time we started.

2) It is 20 km odd from here.

3) It will take half an hour for us give or take a few minutes.

4) An estimated 5000 are going to attend the show.

5) There will be 4000 or thereabouts.

6) They put it somewhere in the region of two to three lakhs.

7) I am almost certain of it.

8) Around 25 kms?

     పైన underline చేసిన మాటలన్నీ కూడా'About' కు బదులు వాడాల్సిన expressions. అన్నీ కూడా daily real life situations లో వాడదగినవే. అయితే 'About' కు ఉన్న అర్థాల్లో, ఏ అర్థానికి పై expressions సరిపోతాయి అని తెలుసుకోవడం అవసరం.

Meanings of about:

1) Connected with/ concerning something/ a person = దేని/ ఏ వ్యక్తి గురించి

The book is about the scientist and his inventions = ఆ పుస్తకం ఆ శాస్త్రజ్ఞుడు, ఆయన కనిపెట్టిన వాటి గురించి

2) About to do something/ happen = ఏదో చేయబోతూ/ జరగబోతు

He was about to leave = అతడు బయల్దేరబోతున్నాడు

3) About = A little more/ less some amount/ number = దగ్గర దగ్గర/ దాదాపు

ఇప్పుడు మనం 'About' కు ఈ మూడో అర్థం ఉన్న ఇతర పదాల గురించి తెలుసుకుందాం. English లో అవి చాలా ఉన్నాయి.

అంటే దాదాపు/ ఇంచుమించు అనే అర్థం ఇచ్చే English expressions తెలుసుకుందాం.

దాదాపు అనే అర్థం ఉన్న ఇతర పదాలు:

1) Odd = దాదాపు; ఇది Spoken English లో ఎక్కువ వాడతాం; అదీ ముఖ్యంగా, చివర సున్నాలు వచ్చే సంఖ్యాపదాల (20, 30 etc. 100, 200 odd etc.)తో వాడతాం.

a) Sanjana: How old do you think he is? (అతడి వయసు ఎంతని అనుకుంటున్నావు?)

Samyuktha: Oh, I don't know thirty odd, I suppose (ఓ, నాకు తెలియదు, దాదాపు 30 ఏళ్ల‌నుకుంటా)

b) Piyush: Santan is very brilliant. (శంతన్ చాలా తెలివైనవాడు).Sashank: How do you know? (ఎలా తెలుసు?)

Piyush: In a class of fifty odd students he alone scored 80 odd marks. (దాదాపు 50 మంది ఉన్న class లో అతనొక్కడే దాదాపు 80 మార్కులు తెచ్చుకున్నాడు).

2) Give or take = more or less = అటో ఇటో - ముఖ్యంగా సంఖ్యలకు (numbers), కిలోమీటర్లు/ మైళ్లలో దూరాన్ని గురించి చెప్పేటప్పుడు, time (సమయాన్ని గురించి) చెప్పేటప్పుడు వాడతాం.a) Ganesh: What is he worth? (అతడి విలువెంత? = అతడికున్న సంపాదన ఎంత?)

Gopal: Rs. 20 crore, give or take a few crore.

(రెండు మూడు కోట్లు అటూ ఇటూగా 20 కోట్లుంటుంది.)

b) Hyderabad is about 300 km north west of Vijayawada, give or take a few kilometres

3) An estimated = Supposed to be nearly =

దాదాపు ఇంత/ ఇన్ని అని అంచనా వేసిన.

a) An estimated 1000 policemen might have lost their lives in fights with maoists so far =

ఇంతవరకు మావోయిస్టులతో జరిగిన పోరాటాల్లో దాదాపు 1000 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు/ 1000 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అంచనా (కచ్చితంగా 1000 మందికాదు).

b) An estimated 1000 people have lost their lives in the recent earthquake in Turkey

ఇటీవల టర్కీలో సంభవించిన భూకంపంలో ఉజ్జాయింపుగా 1000 మంది  ప్రాణాలు కోల్పోయారు.

c) An estimated crore rupees must have gone down the drain in the abandoned project = దాదాపు కోటి రూపాయలు వృథా అయిపోయి ఉండాలి, వదిలేసిన ఆ ప్రాజెక్టులో.

(go) down the drain = వృథా కావడం

4) Or thereabout = దాదాపు.

    అయితే గమనించాల్సిన విషయం: ఇది మనకు అంత కచ్చితంగా తెలియని, అంత ప్రాముఖ్యం ఇవ్వనవసరం లేని సమయం, తేదీ, సంవత్సరం ముందు వాడతాం.

a) Ekambar: Did you see him leave? When? (అతడు వెళ్లడం నువ్వు చూశావా? ఎప్పుడు?)

Gajanan: I did. At 7 or there about.

(చూశాను. దాదాపు 7 గంటలప్పుడు).

b) Hasan: These apartments look rather old (ఈ apartments కాస్త పాతవిగానే కనిపిస్తున్నాయి.)

Hemanth: Why say look? They are. They were build in 1970s or thereabouts.

(పాతవిలా అని ఎందుకనడం? అవి పాతవే. దాదాపు 1970ల్లో నిర్మించినవి.)

c) Sukumar: So when will your results be out? (అయితే మీ ఫలితాలు ఎప్పుడు రావచ్చు?)

Indeevar: In May or thereabouts. (May, ఆ ప్రాంతంలో రావచ్చు.)

5) Almost = దాదాపు. ఇది చాలా సాధారణంగా మామూలు conversation లో వినిపించే మాట = About. వాడుకలో దీనికి వైవిధ్యం కూడా ఎక్కువ. దాదాపు అని మాత్రమే కాకుండా, 'అన్నంత పనీ చేశారు' అనే అర్థం కూడా వస్తుంది.

a) It's almost 10 years since he left his place =

ఆయన ఇక్కడి నుంచి వెళ్లిపోయి దాదాపు పదేళ్లయ్యింది.(హైదరాబాద్ విజయవాడకు ఈశాన్యంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉంది కొన్ని కిలోమీటర్లు ఎక్కువ తక్కువగా).

b) Jagan: How much did he spend on his daughter's marriage? (వాళ్ల అమ్మాయి పెళ్లికి ఎంత ఖర్చు చేశాడు?)Mohan: Almost Rs 50 lakh. (దాదాపు రూ. 50 లక్షలు).

అయితే 'almost' ను ఇలా కూడా వాడతారు:

a) He almost died of the disease = ఆ జబ్బుతో ఆయన దాదాపు మరణించినంత పనైంది (కానీ మరణించలేదు).

b) The robbers almost killed him =

ఆ దోపిడీ దొంగలు అతడిని చంపినంత పనిచేశారు (కానీ చంపలేదు).

6) In the region of: ఆ ప్రాంతంలో; దేన్నైనా ఉజ్జాయింపుగా అంచనా వేసి/ ఊహించి చెప్పడం. దీన్ని something/ somewhere in the region of

a) The cost of each of those apartments might be somewhere in the region of Rs. 60 lakh.

(అందులోని ఒక్కో అపార్ట్‌మెంట్ రూ. 60 లక్షలు, ఆ ప్రాంతంలో ఉండొచ్చు.)

b) Thomas: How much can you invest? (నువ్వు ఎంత పెట్టుబడి పెట్టగలవు?)     

George: Anywhere in the region of Rs. 2 or 3 crore.

(రూపాయలు రెండు మూడు కోట్ల వరకు).

ఇదే అర్థం వచ్చే ఇంకొన్ని పదాలు, మొదటి passage లో లేనివి:

1. Around

a) Around a hundred students did not get their hall tickets = దాదాపు వందమంది విద్యార్థులు హాల్‌టికెట్లు పొందలేదు.

b) It may cost around Rs.. 3000/ = అది దాదాపు మూడువేల రూపాయలవుతుంది.

2. Or so - ఇది చాలా వ్యావహారిక పదం.

For the past two hours or so he has been here = దాదాపు గత రెండు గంటలుగా అతడు ఇక్కడున్నాడు.

3) Approximately = nearly = ఇంచుమించు.

అయితే 'Approximately' (దాదాపు) గ్రాంథికం/ శాస్త్రపరిభాషలో ఎక్కువగా వాడతారు.

a) It weights approximately 99 gms = అది సుమారుగా 99 గ్రాములు ఉంటుంది. (= ఆ ప్రాంతంలో/ ఇంచుమించుగా) అని వాడతాం. 


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌