• facebook
  • whatsapp
  • telegram

Small.. Tiny.. Low

Madhukar: The rooms are rather small, aren't they? We feel a bit cramped, don't We?

(ఈ గదులు చిన్నవిగా ఉన్నాయి కదా! కాస్త ఇరుకుగానే ఉన్నాయి)

Himakar: They are of course, but they are compact for two of us. Moreover it's a newly built flat. So let us take it.

(నిజమే అనుకో, కానీ మన ఇద్దరికీ ఇది సౌకర్యంగానే ఉంటుంది. అంతే కాకుండా ఇది కొత్తగా కట్టిన ఫ్లాట్ కదా! కాబట్టి తీసేసుకుందాం)

Madhukar: You are used to living in tiny houses. So you find the rooms OK. Anyway, If it's OK with you, so is it with me.

(నీకు చిన్న ఇళ్లల్లో ఉండటం అలవాటయ్యింది. అందువల్ల ఈ గదులు నీకు బాగానే ఉన్నాయి. సరే, నువ్వు సరేనంటే నాకూ సరే.)

Himakar: Another thing is for rooms in such an area as this, the rent is quite low. So why don't we take them?

(మరో అంశం ఏమిటంటే, ఇలాంటి ప్రదేశాల్లో ఈ గదులకు, అద్దె చాలా తక్కువనే చెప్పాలి)

Madhukar: OK, then. But We should ask the landlord to do some minor alterations to the room so that we can have better comfort.

(సరేలే. అయితే మనం ఓనర్‌ను కొన్ని చిన్న మార్పులు చేయమని అడగాలి, ఇంకాస్త సౌకర్యంగా ఉండేలా)

Himakar: Then I will tell the owner today itself to make the slight changes, so that we can move in two days from now.

(అయితే నేను ఓనర్‌కు ఈరోజే చేయాల్సిన మార్పుల గురించి చెబుతాను. అప్పుడు మనం రెండు రోజుల్లోనే దీంట్లోకి రావచ్చు.)      

Madhukar: Let him attend to the cleaning of the water tank too. I found minute particles of a chemical used for cleaning it.

(అతడు నీళ్ల ట్యాంక్‌ను కూడా కడిగించాలి. నేను దాంట్లో చాలా చిన్న చిన్న రసాయన కణాలను చూశాను)

Himakar: The landlord is a nice man and appears to be the obliging type.

(ఈ యజమాని మంచివాడుగా, మనం అడిగింది సులభంగా అంగీకరించేవాడిలా కనిపిస్తున్నాడు.)

Madhukar: Who exactly is the landlord? I saw you talking to two men. Is the landlord the one wearing a shirt that has shrunk?

(అసలు ఇంటి యజమాని ఎవరు? నువ్వు ఇద్దరితో మాట్లాడటం చూశాను. ఆ కుంచించుకుపోయిన షర్ట్ వేసుకున్నతనేనా యజమాని?)

Himakar: No, the one with the wrinkled and shrinkelled face.

(కాదు. ముడతలు పడి కుంచించుకుపోయిన మొహం ఉన్నాయన.)

Look at the following sentences from the conversation above:

   1) These rooms are rather small, aren't they?

   2) We feel a bit cramped, don't we?

   3) They are compact for two of us.

   4) You are used to living in tiny houses.

   5) .... the rent is quite low.

   6) We should ask the landlord to do some minor alterations.

   7) Then I will tell the owner to make some slight changes.

   8) I found minute particles of some chemicals.

ఇంతకుముందు మనం, "Big" (అంటే పెద్ద/ ఎక్కువ/ చాలా)తో పాటు అదే అర్థాలున్న అనేక ఇతర పదాల గురించి తెలుసుకున్నాం... ఇప్పుడు "Small" (చిన్న/ తక్కువైన/ కొద్ది) అనే అర్థం వచ్చే పదాల గురించి తెలుసుకుందాం...

1) Small - చిన్న /చిన్నదైన.

A  small house/ a small car/ a small box etc., (చిన్న ఇల్లు/ కారు/ పెట్టె మొదలైనవి)

"Small"ను వయసులో చిన్న అనే అర్థంతో కూడా వాడతాం

Small = Young

1) He has two small children.
 

2) My dad showed me all these places when I was small.   

(మా నాన్న నా చిన్నతనంలోనే నాకు ఈ ప్రదేశాలన్నింటినీ చూపించారు.)

3) Small కు మరో అర్థం: ప్రాముఖ్యం లేని.

    They often quarrel over small matters = వాళ్లు తరచూ చిన్న చిన్న (ప్రాముఖ్యంలేని) విషయాలపై గొడవలు పడుతుంటారు.

a) Ananth:Without your permission he has made a few changes in the arrangements.

    (అతడు నీ అనుమతి లేకుండా ఏర్పాట్లలో కొన్ని మార్పులు చేశాడు)

Sajjan: I've seen them. They are small. Let's not worry about such small matters.

  (నేను వాటిని చూశాను. అవి చాలా చిన్నవి. అలాంటి చిన్న చిన్న/ ప్రాముఖ్యం లేని విషయాలను పట్టించుకోవద్దు.) 

2) Cramped - ఇది కూడా small కు సంబంధించిందే. అయితే దీన్ని ఎల్లప్పుడూ చాలా చిన్నదై ఇరుకుగా ఉండే స్థలానికి వాడతాం = A room/ space/ vehicle without enough space for people to move about freely.

a) Balu: Why did you get off the bus before your bus stop?

    (నీ బస్ స్టాప్ రాకముందే, ఆ బస్ నుంచి ఎందుకు దిగిపోయావు?)

Sumanth: I could not bear even to stand in that cramped bus.

   

(ఆ ఇరుకు (రద్దీ ఎక్కువగా ఉన్న) బస్‌లో నిలబడటాన్ని కూడా భరించలేకపోయాను.)

b) He resigned from his job because he could not work in that cramped office.

     (చాలా ఇరుగ్గా ఉండే ఆ ఆఫీస్‌లో పనిచేయలేక ఉద్యోగం వదిలేశాడతడు.)      

3) Compact: Small but comfortable and convenient because the space has been used effectively

a) We are happy about the flat - small but compact - best for the two of us and suits our pocket = ఈ flat విషయంలో మేం చాలా సంతోషంగా ఉన్నాం. అది చిన్నదైనా సౌకర్యంగా ఉంది. మాలాంటి ఇద్దరికి అది ఉత్తమమైంది, మా స్థితికి తగింది. = ఇల్లు/ గదిలాంటివి చిన్నదైనప్పటికీ సౌకర్యంగా ఉండేది, స్థలం అమరికగా/ సరైనవిధంగా ఏర్పరచడం వల్ల.

b) The lab is compact, providing the needed facilities within the limited area.

(పరిమితమైన స్థలంలో అవసరమైన వసతులతో ఆ ప్రయోగశాల చాలా సౌకర్యంగా ఉంది.)

 సౌకర్యంగా, మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకు వెళ్లేందుకు వీలుగా ఉన్న వస్తువులను కూడా Compact అంటాం. A compact camera, a compact computer, a compact TV etc. 

4) Tiny (Pronunce: taini) = Very small in size/ quantity = పరిమాణం/ మొత్తం (డబ్బులాంటివి) చాలా చిన్న/ తక్కువ అనే అర్థంతో వాడతాం.

a) The Buddhists form a tiny minority of our population.

(మన జనాభాలో బౌద్ధులు మరీ అల్ప సంఖ్యాకులు.)b) He left the job because he was paid a tiny amount as salary.

(జీతం చాలా తక్కువగా ఉన్నందువల్ల అతడు ఉద్యోగం వదిలేశాడు.)

c) The tiny fingers of the baby are very tender.

(ఆ బిడ్డ చిన్నిచిన్ని వేళ్లు సున్నితంగా ఉన్నాయి)

Tiny house/ tiny building

5) Low = Very small quantity/ amount (తక్కువ మొత్తం) అయితే ఇవి ముఖ్యంగా ధరలకు, వేతనాలకు, నీరు లేదా ఇతర ద్రవాల మట్టం (level)ను తెలపడానికి వాడతాం, అవి ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే.

a) This is the right time to buy a car because the prices are low.

(ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. కారు కొనేందుకు ఇదే సరైన సమయం.)

b) The water levels in the dams are low and hence the power shortage.

(డ్యామ్‌లలో నీటి మట్టం ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటంతో విద్యుత్ కొరత ఏర్పడింది.)

Low wages/ salaries/ pay అని కూడా అంటాం. 

6) Minor = తక్కువ ప్రాముఖ్యమున్న/ ప్రాముఖ్యం లేని = Not so important = Small.

a) They are some changes, but they are minor - need not worry = కొన్ని మార్పులున్నాయి, కానీ అవి అంత ప్రాముఖ్యం లేనివి/ చిన్న చిన్నవి - మనం ఆందోళన పడాల్సిన అవసరం లేనివి.

b) She fell off the stairs, but she suffered only minor injuries = ఆమె మెట్ల మీద నుంచి పడిపోయింది, కానీ చిన్న చిన్న గాయాలే అయ్యాయి.

c) The movie is good except for a few minor defects = కొన్ని చిన్న చిన్న పొరపాట్లను మినహాయిస్తే, ఆ సినిమా బాగుంది.      

7) Slight = Small/ unimportant = స్వల్పమైన/ చిన్నదైన. (Minor/ small వాడవచ్చు.)

a) His condition has improved only slightly/ There has been only a slight improvement in his condition, says the doctor = అతడి పరిస్థితిలో చాలా స్వల్పమైన మెరుగు ఉంది/ చాలా స్వల్పంగా మెరుగైంది అని డాక్టరు చెప్పారు.

b) The police do not have the slightest idea of the planters of the bomb.

(ఆ బాంబ్ అక్కడెవరు పెట్టారనే విషయంలో పోలీసులకు కొంచెం కూడా బోధపడటంలేదు.)

c) His knowledge of the subject is slight.

(అతడికి ఆ విషయం గురించి తెలిసింది తక్కువ. ఇదే అర్థంతో little అని కూడా వాడతాం. అయితే little వాడటంలో చాలా జాగ్రత్త అవసరం. Little అంటే దాదాపుగా ఏమీలేదనే అర్థం.) - లాంటివి కూడా వాడవచ్చు.)     
He has little respect for elders.

(పెద్దలపట్ల అతడికి గౌరవం దాదాపుగా లేదు.) 

* కొద్దిగా = A little

I have still a little respect for you. Don't lose it = నువ్వంటే నాకు ఇంకా కొద్దిగా గౌరవం ఉంది. దాన్ని పోగొట్టుకోకు.

   She has little money = లేదు

   She has a little money = కొద్దిగా ఉంది

   The little = ఉన్న ఆ కాస్త

I lost the little money I had had = నా దగ్గర ఉన్న ఆ కాస్త డబ్బూ పోగొట్టుకున్నాను.

   అయితే little కు చిన్న అనే అర్థం కూడా ఉంది కదా! ఆ అర్థంతో small, little (a little అక్కరలేదు) ఒకటే.

Small children = Little children

a) The little house they live in is beautiful = వాళ్లుండే చిన్న ఇల్లు అందంగా ఉంటుంది.

8) Minute (Pronunce - mainyut మైన్యూట్) = Very very small = సూక్ష్మమైన/ చాలా చిన్నదిగా ఉన్న. దీనికీ minute (మినిట్ = నిమిషం) కూ spelling 

a) There were minute traces of the poison were found in the patient's blood.

(రోగి రక్తంలో అతిసూక్ష్మమైన విషపు ఛాయలున్నాయి.)

b) The substance is so poisonous that even minute dose of it can kill a person.

(అతి తక్కువ మోతాదులో కూడా ఆ పదార్థం మనిషిని చంపగలదు (అది అంత విషపూరితమైంది))

c) He is a great director because he pays attention even to minute detail.

(అతి చిన్న విషయంలోనూ ఎంతో శ్రద్ధ చూపిస్తాడు కాబట్టి అతడు అంత గొప్ప దర్శకుడు.)

d) The microscope can show even minute organs.

(అతిసూక్ష్మమైన జీవులను కూడా ఆ సూక్ష్మదర్శిని చూపగలదు.) ఒకటే, కానీ అర్థంలో తేడా ఉంటుంది.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌