• facebook
  • whatsapp
  • telegram

Balanced diet .. Staple diet


Gokul: A good number of Indians don't have enough money to buy food even for a day.

(మనదేశంలో చాలామందికి రోజుకు కావాల్సినంత ఆహారం కొనేందుకు కూడా డబ్బు ఉండదు.)

Subbarao: Let alone the food for the day, they don't get something to eat, even after the work for the day.

(రోజుకు తగినంత ఆహారం సంగతి అటుంచు, రోజంతా పనిచేశాక కూడా తినేందుకు తిండి సరిగా ఉండదు.)
 

Gokul: While this is so, there are others who aim at reducing the fat in their diet.

(ఇదిలా ఉంటే, మరికొందరుంటారు, వాళ్లు తమ ఆహారంలో కొవ్వు తగ్గించుకోవాలనుకుంటారు.)

Subbarao: The children of the poor do not get proper nourishment.

(పేద పిల్లలకు సరైన పోషకాహారం అందడంలేదు.)

Gokul: Add to this, fast food joints are on the increase, and are doing a roaring business.

(దానికితోడు, ఫాస్ట్‌ఫుడ్ దుకాణాలు ఎక్కువ అవుతున్నాయి. వాటి పనే చాలా బాగా ఉంది.)

Subbarao: That reminds me. One of the restaurants here is very famous for a vegetable dish with spices and nuts. They do, of course, some serve a variety of other dishes too.

(నువ్వంటే నాకు గుర్తొచ్చింది. సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పులతో తయారుచేసే ఒక ప్రత్యేక శాఖాహార వంటకానికి ఇక్కడున్న హోటళ్లలో ఒకటి పెట్టింది పేరు. అలాగే మరికొన్ని ప్రత్యేక వంటకాలు కూడా తయారు చేస్తారు.)

Gokul: I know that place. That dish is its speciality.

(ఆ చోటు నాకు తెలుసు. ఆ వంటకం ఆ హోటల్ యొక్క ప్రత్యేకత.)

Subbarao: Biryani is a delicacy special to Hyderabad. Whoever visits the city makes it a point to enjoy it.

(హైదరాబాద్ అనగానే మొదట గుర్తొచ్చేది బిర్యానీయే. నగరానికి ఎవరొచ్చినా, దాని తినడం/ఆస్వాదించడం ఒక పనిగా పెట్టుకుంటారు.)

Gokul: How about having it now? (ఇప్పుడు తిందామా?)

Subbarao: I am game for it. (నేను రెడీ)

పై సంభాషణలో పదాలన్నీ ఆహారానికి సంబంధించినవే. ఇప్పుడు మనం దానికి సంబంధించిన Vocabulary చూద్దాం.

Look at the following sentences from the conversation above.

  a) A good number of Indians don't have enough money to buy food.

  b) Something to eat.

  c) ....... reducing their fat in their diet.

  d) The children of the poor do not get enough nourishment.

  e) Add to this, fast food joints are on the increase.

  f) One of the restaurants here is very famous for a vegetable dish.

  g) Biriyani is a delicacy special to Hyderabad.

Notes:

1. Let alone = దాని సంగతి అటుంచు.

Let alone helping me, he began to cheat me.

(నాకు సాయంచేసే విషయం అటుంచి, నన్ను మోసం చేయసాగాడు.)

2. Joint = Usual meaning, a meeting point of two bones = కీలు;

ఇక్కడి అర్థం:

A cheap bar/ restaurant = చౌక రకం బార్ / ఫలహార శాల.

3. Add/added to this = not only this, but also = దీనికి తోడు.

4. A roaring business = ఇది చాలా useful expression

      A profitable business = లాభాలు గడిస్తున్న వ్యాపారం.

5. Spices = Substances that add good smell to feel

         = యాలకులు, దాల్చినచెక్క, లవంగం లాంటి సుగంధ ద్రవ్యాలు.

Game for something = ready for it.

 పై సంభాషణలో మాటలన్నీ తినడానికి, ఆహారానికి సంబంధించిన మాటలే. .

అవి: food, to eat, fat, nourishment, fast food, junk food, dish and delicacy.

Food = What people eat and drink to grow and stay alive = ఆహారం

a) Gopal: Do you know, food is quite cheap in a number of advanced countries.

  (నీకు తెలుసా? అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహారం చాలా చవక!)

Abhishek: In addition to that, their population are small. In our country, food is expensive, because there are too many mouths to feed.

 (అంతేకాకుండా అక్కడి జనాభా చాలా తక్కువ. మన దేశంలో ఆహారం ఖరీదే. ఎందుకంటే ఎక్కువమంది అన్నార్తులున్నారు కాబట్టి)

b) The food most Indians eat have low energy values.

(మనదేశంలో చాలా మంది తినే ఆహారం శక్తి విలువలున్నది కాదు.)

మామూలు సంభాషణలో food బదులు, to eat అంటారు.
 

a) Shanmukh: I have yet to eat. I am hungry.

(ఆకలితో ఉన్నా.ఇక  భోంచేయాలి.)

Sukhadev: I've just had my meal. Why haven't you eaten?

( నేను ఇప్పుడే భోంచేశాను. నువ్వు ఇంకా ఎందుకు చేయలేదు?)

 వ్యావహారిక English లో meal వాడకం చాలా తక్కువ. ఎక్కువగా eat అని లేదా వేళను బట్టి తినే ఆహారం పేరు వాడతారు.    

              Breakfast, lunch, dinner and supper.

              Lunch = Midday meal.

              Dinner = Most important meal of the day.

              The night meal for most of us and the late evening meal for Westerners'.

              Supper - Late in the night, something to eat - not a regular (important meal).

* Diet = Type of food somebody usually eats.

              (మామూలుగా మనం తీసుకునే ఆహారం)

a) Pavithra: Are you in trouble? What did the doctor say?

            (ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నావా? డాక్టరేమన్నాడు?)

Sravan: He advised me to reduce the fat in my diet.

             (నేను తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాన్ని తగ్గించమన్నాడు.)

b)    The diet most Indians take is rich in carbohydrates.

        (చాలామంది భారతీయులు తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు ఎక్కువ.)

c) We also take of a healthy diet/ poor diet/ good diet etc.

        Balanced diet = A good combination of healthy foods.

        అన్ని పోషక విలువలందించగల/ పోషక విలువలున్న సమతుల్య ఆహారం.

        Staple diet: A main diet consisting of basic item - like rice for South Indians.

         ఒక ఆహారం ముఖ్యంగా ఉండి, మిగతా పదార్థాలు ఉండే భోజనం.

     ఉదాహరణకు, దక్షిణ భారతదేశంలో అన్నంతో మిగతా పదార్థాలు కలిపి తింటారు. అన్నం (Rice) అనేది staple food.

d) Nourishment: Strength giving things that the body needs to be strong and to grow.

              (బలవర్థక పదార్థాలు అంటే శరీరానికి కావాల్సిన బలానిచ్చేవి, పెరుగుదలకు తోడ్పడేవి.)

              Proper nourishment is necessary for a growing child.

             (పెరిగే పిల్లలకు ప్రత్యేక పోషక విలువలు ఉన్న ఆహారం అవసరం.)

e)    Fast food = Food prepared and served quickly to customers.

       (అప్పటికప్పుడు త్వరత్వరగా వండి customers కు వడ్డించగల ఆహార పదార్థాలు. - సామాన్యంగా ఇవి self - service eateries అయి ఉంటాయి.)

       Eatery - మనం తినే చోట్లు - Restaurants/ Canteens/ Fast food joints లాంటివి.

       Hotel కూ, restaurant  (pron- రెస్టరంట్/రెస్టరాంట్- రెస్టారెంట్ కాదు)కూ తేడా ఉంది.

      Hotel - Lodge: వసతులు ఉండే చోటు.

Restaurant: ఫలహారాలు, భోజనంచేసే చోటు మాత్రమే.

ఇది చూడండి.

Eateries across the city mostly serve junk food.

(నగరం మొత్తంలో ఉన్న ఫలహారశాలలు చాలావరకు, ఆరోగ్యానికి హాని కలిగించే టిఫిన్లనే అమ్ముతాయి).

ఇక్కడ మరో విషయం - టిఫిన్ (Tiffin అనే spelling తో) అనే మాట English లో లేదు. ఇది English కాదు. టిఫిన్‌కు బదులు వాడే మాట: snack (correct English  లో). అదే meetings లో, ఏ సందర్భంలోనయినా విశ్రాంతి సమయంలో వాడే మాట refreshments ( ఇది ఎప్పుడూ plural).

Most of my friends have snacks instead of a regular meal on Saturday nights.

(మా స్నేహితుల్లో చాలామంది, శనివారాలు రాత్రిపూట మామూలు భోజనం బదులు, ఫలహారం తీసుకుంటారు- ఒక్క పొద్దువాళ్లు.)

f) Dish = వంటకం: A food item cooked as a part of a meal - భోజనంలో భాగంగా వడ్డించే పదార్థం - కూర, సాంబారు, పప్పు లాంటివి.

a)  Sumanth: So, what were the highlights of the dinner?

                       (అయితే ఆ విందులో ముఖ్యాంశాలేమిటి?)

       Srikanth: They served a wonderful dish that is special to this area - avial.

                      (ఈ ప్రాంతంలో బాగా వండే ప్రత్యేకమైన వంటకం - అవియల్‌ను వడ్డించారు.)

b)    Perugu Vada with a sprinkling of Karaboondi is a dish I like.

                      (కారబూందీ చల్లిన పెరుగు వడ అనే వంటకం నాకిష్టం.) 

        (Dish = వంటకు ఉపయోగించే పాత్ర కూడా)

Delicacy: మనం మామూలుగా వాడే అర్థాలు:

1)   ఇతరుల మనసు నొప్పించకుండా ఉండటం (A sensitive nature

2)   Easily damaged (సులభంగా పాడయ్యేది).

కానీ ఆహారం గురించి మాట్లాడే సందర్భంలో, Delicacy = Expensive or rare and very tasty food = చాలా ఖరీదైన, అరుదైన, బాగా రుచికరమైన వంటకం.

a)   Hyderabad Biryani is a delicacy that draws people from all over the world.

       (ప్రపంచం మొత్తం నుంచి అందర్నీ ఆకర్షించే గొప్ప వంటకం- హైదరాబాద్ బిర్యానీ.)

b)   Lakshman: What delicacy did you get to eat in Delhi? (ఢిల్లీలో నువ్వు తినగలిగే గొప్ప వంటకం ఏది?)

Ramana: Don't tell any one. My friend, a forest officer, arranged a dinner with Venison.

(ఎవరితో చెప్పకు. అటవీ శాఖాధికారి నా స్నేహితుడు. ఒకసారి జింక మాంసంతో విందిచ్చాడు. Venison = జింక మాంసం - (నిషిద్ధం.))).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌