• facebook
  • whatsapp
  • telegram

 His heirs are angry

  Airs, Heirs; Amiable, Amicable ...ఇలా స్వల్పమైన తేడాతో కనిపించే జంట పదాలు మనల్ని తికమక పెడుతుంటాయి. వీటి మధ్య తేడాలేమిటో ఉదాహరణల సాయంతో తెలుసుకుందాం!

Mukul: Did you notice Anand's behaviour at the party yesterday? A sudden change in him, wasn't there? (నిన్న పార్టీలో ఆనంద్‌ ప్రవర్తన గమనించావా? ఉన్నట్టుండి ఏదో మార్పు ఉంది, కదా?)

Surya: Certainly there was. He was putting on airs and looked a bit cocky too (కచ్చితంగా. తనేదో చాలా ముఖ్యమైన వ్యక్తి అయినట్టూ, తను ఏదైనా చేయగలననే ధీమా ఉన్నట్టూ కనిపించాడు).

Mukul: What could the sudden change in his behaviour due to? (అతనిలో ఇంత అకస్మాత్తుగా మార్పుకు కారణం ఏమై ఉంటుంది?)

Surya: I've (I have) heard that he's (he has) become one of the heirs to his late childless uncle's property. That might be the reason (పిల్లలు లేని- ఈమధ్యనే చనిపోయిన- వాళ్ల బాబాయి ఆస్తికి ఇతడొక వారసుడయ్యాడనుకుంటా. అది కారణమవచ్చు).

Mukul: Earlier he used to be quiet amiable and unassuming. This sudden change in him is upsetting, you know (అంతకు ముందతను చాలా స్నేహపూర్వకంగా, నిగర్విగా ఉండేవాడు. ఈ అకస్మాత్తు మార్పు కాస్త కలవరపెడుతోంది).

Surya: The property of his uncle had for long been in disputes and only recently they came to an amicable settlement. Anand's share may run into about 50 lakhs (వాళ్ల బాబాయి ఆస్తి చాలాకాలంగా వివాదాలలో ఉంది. ఈమధ్యనే వాళ్లు దాని విషయంలో స్నేహపూర్వకంగా సుహృద్భావంగా తీర్మానం చేసుకున్నారు. దానిలో ఆనంద్‌ వాటా సుమారు రూ. 50 లక్షలు వచ్చింది).

Mukul: He is quite lucky. If only that doesn't change him! (అతను చాలా అదృష్టవంతుడు. అది అతనిలో మార్పు తేకుండా ఉంటే ఎంత బాగుంటుంది!)

Look at the following pairs of expressions from the conversation above

       I   i) Airs (putting on airs) 

            ii) Heirs

      II  i) Amiable

           ii) amicable

I i) Airs = behaving in a way that shows somebody is more important than they really are (ఎవరైనా తాము చాలా ముఖ్యులం/ గొప్పవాళ్లం అనే భావంతో ప్రవర్తించడం/ తాము చాలా ముఖ్యులం అనుకోవడం, ముఖ్యులు కాకపోయినప్పటికీ)/ ఎచ్చులు పోవడం

        'Airs' ను సామాన్యంగా put on airs/ give oneself airs అనే expression లో భాగంగా వాడతాం = ఎచ్చులు పోవడం

a) Madhurima: Ramani is quite beautiful, isn't she? Perhaps she is the most beautiful in the class (రమణి చాలా అందగత్తె కదా? బహుశా తరగతి మొత్తంలో అందరిలో అందగత్తె తనేనేమో!)

Sulochana: Perhaps she is. But I hate the way she puts on airs/ she gives herself airs (ఉండొచ్చు. కానీ తను ఎచ్చులు పోయే విధానం నాకు నచ్చదు).

b) Prem: I hate Chalapathi. He did not receive me properly at his birthday party (చలపతి అంటే పడదు నాకు. తన పుట్టినరోజు పార్టీలో నన్ను సరిగా చూసుకోలేదు).

Syam: Nothing of the sort. He was quite warm and hospitable. Everyone was happy. The trouble was you are putting on airs. That's all (అలాంటిదేంలేదు. అందరికీ ఆప్యాయంగా ఆతిథ్యమిచ్చాడు. చిక్కేంటంటే నువ్వేదో లేనిపోని ప్రాముఖ్యం నీకుందనుకోవడం/ ఎచ్చులు పోవడం).

ii) heir(s) = heir (pronounced like air) - దీన్ని కూడా 'air' (గాలి)లా, air అనే ఉచ్చరిస్తాం. Heir = successor to property/ kingdom, etc - వారసుడు.

a) Somu: The rich man, childless died without leaving a will (వీలునామా రాయకుండానే ఆ పిల్లలు లేని శ్రీమంతుడు చనిపోయాడు).

Krishna: But I heard that several are claiming to be his heirs? (కానీ నేను విన్నది, చాలామంది అతనికి వారసులమని ముందుకొస్తున్నారని).

b) Madhu: His heirs are very angry with the late businessman (చనిపోయిన ఆ వ్యాపారస్థుడి వారసులు అతని మీద చాలా కోపంగా ఉన్నారు).

Surendra: Why? (ఎందుకు?)

Madhu: He's (He has) left all his property to charitable institutions (అతను తన ఆస్తినంతా ధర్మసంస్థలకు రాసేశాడు).

II i) Amiable = pleasant, friendly and likable (అందరితో కలివిడిగా, స్నేహపూర్వకంగా ఉండడం)

a) Achyuth: Bhagavan is the best behaved in our group (మన బృందంలో భగవాన్‌ అత్యంత మంచి నడవడి ఉన్నవాడు).

Bhaskar: You can say that again and again. He is the most amiable guy of all of us (నువ్వామాట మళ్లీ మళ్లీ అనొచ్చు. మన బృందం మొత్తంలో అతను అత్యంత స్నేహశీలి).

b) Ashok: I like our new boss. What a contrast between him and his predecessor! (మన కొత్త బాస్‌ నాకు నచ్చాడు. ఆయనకూ, ఆయన ముందున్నతనికీ ఎంత తేడా! contrast = తేడా)

Sivaji: So does every body in the office. He is so amiable that he makes us forget he is a boss! (ఆఫీస్‌లో ప్రతివాళ్లకూ ఆయనంటే ఇష్టమే. ఆయన తను మనకు బాస్‌ అనే విషయాన్ని మరచిపోయేట్లు చేసే స్నేహశీలి!)

ii. Amicable = Friendly and polite in relationships/ dealings = స్నేహపూర్వక సుహృద్భావ సంబంధాలతో కూడిన (ఒప్పందాలూ, తీర్మానాలు లాంటివి)

a) Gopal: There appears to be no end in sight to the disputes between India and Pakistan (భారత్‌, పాక్‌ల మధ్య వివాదాలకు అంతు కనపడడం లేదు).

Gopal: An amicable settlement of the outstanding disputes between them would be good for both (రెండు దేశాల వివాదాలూ, స్నేహపూర్వక సుహృద్భావ పరిష్కారం రెండు దేశాలకూ మంచిది).

b) Sriharsha: What happened to the quarrel between Madan and Madhav? (మదన్‌, మాధవ్‌ పోట్లాట ఏమయింది?)

Sagar: It all ended happily. They have come to amicable settlement (అంతా సుఖాంతంగానే అయింది. ఇద్దరూ స్నేహపూర్వక పరిష్కారానికి వచ్చారు).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌