• facebook
  • whatsapp
  • telegram

మూలధన వ్యయం.. లొసుగుల మయం!

పలు రాష్ట్రాలు మూలధనాన్ని సరిగ్గా ఖర్చు చేయడంలేదు. ఈ నిధులను ఓట్ల పథకాలకు మళ్ళిసున్నాయి. దాంతో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన ముందుకు సాగడంలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా బడ్జెట్లో 50ఏళ్ల పాటు రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇవి సద్వినియోగమయ్యేలా కేంద్రం జాగ్రత్త వహించాల్సిన అవసరముంది.

ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం ప్రకారం గతంలో రాష్ట్రాలకు నిర్దేశించిన ద్రవ్యలోటు జీడీపీలో మూడు శాతం ఉండేది. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో దాన్ని 3.5శాతానికి  పెంచారు. అలాగే రాష్ట్రాలకు దీర్ఘకాలానికి వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ క్రమంలో 2023-24 కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల రుణాల కోసం రూ.1.3 లక్షల కోట్లను ప్రత్యేకించారు. వీటిని కేవలం ఆ సంవత్సరంలోనే అందులోనూ మూలధన వ్యయం కిందే రాష్ట్రాలు వెచ్చించాలి. కేంద్ర బడ్జెట్లో మూలధన వ్యయానికి కేటాయించిన రూ.10లక్షల కోట్లకు ఇది అదనం. కేంద్రం, రాష్ట్రాలు ఇలా మౌలిక వసతులపై వెచ్చించడం వల్ల ప్రైవేట్‌ పెట్టుబడుల ప్రవేశానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.  

కేటాయించిన నిధుల్లో కోత

మూలధన వ్యయాన్ని దేనిపై ఖర్చు చేయాలన్న అంశంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే, ప్రత్యేకించి కొన్నింటి నిమిత్తమే ఆ నిధులను కచ్చితంగా వెచ్చించాలని కేంద్రం షరతు విధించింది. కాలంచెల్లిన వాహనాల స్థానంలో కొత్త వాటిని సమకూర్చడం, పట్టణ ప్రణాళికల రూపకల్పనతో పాటు పోలీసుశాఖ కోసం గృహ నిర్మాణాలపై నిధులను వెచ్చించాలి. అలాగే పిల్లల కోసం గ్రంథాలయాల ఏర్పాటు, డిజిటల్‌ వసతుల కల్పన, పీఎం గతిశక్తి, గ్రామ్‌ సడక్‌ యోజన, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వంటి వాటిపైనా ఆ రుణాలను ఖర్చు చేయాలి. వడ్డీలేని రుణాల విషయంలో ఇలా పలు నిబంధనలను విధించడంపై పలు వాదనలు వ్యక్తమవుతున్నాయి. రుణాలు సద్వినియోగమయ్యేలా విధివిధానాలు ఉండాలి.

రాష్ట్రాలకు కేంద్రం వడ్డీ లేని రుణాలు ఇవ్వడం నిరుటి నుంచే మొదలయ్యింది. గత బడ్జెట్లో అందుకోసం లక్ష కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ సారి నిధులు కాస్త పెరిగాయి. రాష్ట్రాలకు ఇస్తున్న సాధారణ రుణాలకు ఇవి అదనం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల బడ్జెట్‌పై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వార్షిక అధ్యయనం పలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రాలు వార్షిక బడ్జెట్లలో ప్రతిపాదిస్తున్న మూలధన వ్యయాలకన్నా వాస్తవ రూపంలో వెచ్చిస్తోంది చాలా తక్కువ. 2020-21లో రాష్ట్రాలు బడ్జెట్లో మూలధన వ్యయానికి ప్రత్యేకించిన నిధుల్లో 69శాతమే వెచ్చించాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో ద్రవ్యలోటును నియంత్రించడానికి మూలధన వ్యయాన్ని చాలావరకు తగ్గిస్తున్నాయి. లేదంటే కొన్ని ప్రాజెక్టులను పక్కన పెడుతున్నాయి. మూలధన వ్యయం కింద కేటాయించిన నిధుల ఖర్చు విషయంలో రాష్ట్రాల మధ్య తీవ్ర వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. 2017-20 మధ్య కాలంలో మూడేళ్లలో రాష్ట్రాలన్నీ కలిపి మూలధన వ్యయం కింద బడ్జెట్లో కేటాయించిన మొత్తం నిధుల్లో సగటున 21.3శాతం మేర కోత విధించాయి. రాష్ట్రాలు నెలవారీగా వెచ్చిస్తున్న మూలధన వ్యయం తీరు భిన్నంగా ఉంది. గత అయిదేళ్ల సగటు తీసుకుంటే ఏటా మొదటి అర్ధ సంవత్సరంలో రాష్ట్రాలు మూలధన వ్యయం కింద కేటాయించిన నిధుల్లో మూడో వంతే వ్యయం చేశాయి. 25శాతం కన్నా ఎక్కువ నిధులను ప్రతి ఆర్థిక సంవత్సరం ఆఖరు నెల అయిన మార్చిలోనే వెచ్చించాయి. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం నిధులు ఖర్చు చేయాలనే తపనతోనే ఈ విధంగా చేయడం అలవాటుగా మారింది.

కట్టడి కీలకం

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మొత్తం ద్రవ్యలోటు 2020-21లో జీడీపీలో 4.1శాతానికి పెరిగిందని తేలింది. 2004-05 తరవాత ఇదే అత్యధిక ద్రవ్య లోటు. 2021-22 బడ్జెట్‌ అంచనాల ప్రకారం నిర్ణయించిన ద్రవ్యలోటు 3.5శాతం. సవరించిన అంచనాల ప్రకారం అది 3.7శాతం. అయితే, వాస్తవ ద్రవ్యలోటు 2.8శాతం. రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయాల పెరుగుదల అంచనా వేసిన దానికన్నా ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలన్నీ తమ బడ్జెట్లలో స్థూల ఆర్థిక లోటును జీడీపీలో 3.4శాతంగా అంచనా వేశాయి.  రాష్ట్రాల మధ్య ఈ విషయంలో తారతమ్యాలున్నా, కేంద్రం నిర్దేశించిన నాలుగు శాతం కన్నా ఇది తక్కువే. ఆర్థిక శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశం మేరకు ద్రవ్య లోటును జీడీపీలో మూడు శాతానికి, రుణ పరిమితిని 20శాతానికి కట్టడి చేసే స్థాయికి చేరుకుంటే మంచిది.
 
********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇరాన్‌ సౌదీల కొత్త నెయ్యం

‣ వనాలు.. మానవాళికి రక్షా కవచాలు!

‣ ఖలిస్థాన్‌ ఉద్యమానికి ఉగ్రమూకల ఊతం

‣ కాలుష్య కట్టడికి సౌరశక్తి

‣ సముద్ర జీవులకు శబ్దకాలుష్యం ముప్పు

‣ తృణధాన్యాలతోనే పోషక భద్రత

Posted Date: 25-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్థిక రంగం

మరిన్ని
 
లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

విద్యా ఉద్యోగ సమాచారం