• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ బ‌డ్జెట్ 2023-24

2023-24 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.  ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తోంది అంటూ బడ్జెట్‌ ప్రసంగాన్ని కొనసాగించారు.
తెలంగాణ మొత్తం బడ్జెట్‌ 2,90,396 కోట్లు
తెలంగాణ మొత్తం బడ్జెట్‌ 2.90లక్షల కోట్లు అని హరీశ్‌రావు చెప్పారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం 37,525 కోట్లు, వ్యవసాయానికి కేటాయింపులు రూ.26,831 కోట్లు
వ్యవసాయానికి కేటాయింపులు రూ.26,831 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ.26,885కోట్లు
 విద్యుత్‌ కేటాయింపులు రూ.12,727కోట్లు
‣ ఆసరా ఫించన్ల కోసం రూ.12వేల కోట్లు
 దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు
 ఎస్సీ ప్రత్యేక నిధి  కోసం రూ.36,750 కోట్లు
 ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15,233కోట్లు
 బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
 మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131కోట్లు
ఆసరా పింఛన్ల కోసం రూ.12వేల కోట్లు
గత బడ్జెట్‌లో చెప్పిన విధంగా 57ఏళ్లు నిండిన వారికి పింఛన్‌ ఇస్తున్నాం. ఈ మేరకు 2022లో కొత్తగా 8,96,592 మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తున్నాం. ఈ బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం
దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు
‘‘అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. దళితబంధు సాయం వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా.. ఆ సంపద సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడటానికి తోడ్పడుతోంది. ఈ క్రమంలో దళితబంధు పథకం కోసం ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లు ప్రతిపాదిస్తున్నాం’’
కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ కోసం రూ.3,210కోట్లు
కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ పథకం కింద కుల, మతాలకతీతంగా పేదింటి ఆడపిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం 1,00,166 రూపాయలు ఆర్థికసాయం అందిస్తోంది. ఈ బడ్జెట్‌లో ఇందుకోసం రూ.3,210కోట్లు కేటాయిస్తున్నాం. మహిళా శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో రూ.2.131కోట్ల ప్రతిపాదిస్తున్నాం. మైనార్టీ సంక్షేమం కోసం రూ.2,200 కోట్లు కేటాయిస్తున్నాం.’’
అటవీశాఖ, తెలంగాణ హరితహారానికి రూ.1471 కోట్లు
‘‘హరితహారం కార్యక్రమంలో ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొంటున్నారు. తెలంగాణలో మొత్తం గ్రీన్‌ కవర్‌ 1.70శాతం పెరిగింది. రూ.1500 కోట్ల వ్యయంతో 13లక్షల ఎకరాల అడవికి తెలంగాణ ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించింది. రాష్ట్రంలో పులుల సంఖ్య 26కు చేరింది. చిరుతల సంఖ్య 341 అయింది. అటవీశాఖ, తెలంగాణ హరితహారానికి ఈ బడ్జెట్‌లో రూ.1,471 కోట్లు ప్రతిపాదిస్తున్నాం’’
విద్యశాఖకు రూ.19,093కోట్లు
రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ‘మన ఊరు మన బడి’ ద్వారా పాఠశాలల అభివృద్ధి, యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, ఆంగ్ల మాధ్యమంలో బోధన ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోంది. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. విద్యాశాఖ అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో రూ.19,093కోట్లు ప్రతిపాదిస్తున్నాం’’
వైద్య, ఆరోగ్య రంగానికి రూ.12,161 కోట్లు
‘‘పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ప్రతి లక్ష జనాభాకు సగటున 19 ఎంబీబీఎస్‌ సీట్లతో వైద్య విద్యలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. కంటి వెలుగు ద్వారా 1 కోటి 54లక్షల మందికి పరీక్షలు నిర్వహించి 40లక్షలకు పైగా కళ్లద్దాలను పంపిణీ చేసింది. హైదరాబాద్‌ నగరం నలువైపులా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోంది. 1100 కోట్ల ఖర్చుతో రెండు వేల బెడ్ల సామర్థ్యంతో వరంగల్‌లో హెల్త్‌ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించింది. డయాలసిస్‌ సేవలు, మాతాశిశు ఆరోగ్యం.. పౌష్టికాహారం, కేసీఆర్‌ కిట్‌, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ వంటి వాటితో పాటు, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ వ్యాధులతో అవసాన దశకు చేరిన రోగులకు ప్రభుత్వం పాలియేటివ్‌ కేర్‌ను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. వైద్య, ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.12,161 కోట్లు ప్రతిపాదిస్తున్నాం’’
హోంశాఖకు రూ.9,599 కోట్లు
‘‘రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ సమర్థంగా ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం కొత్తగా 31,198 పోలీసు ఉద్యోగాల కల్పన చేశాం. రాష్ట్రంలో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయడం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9.8 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో విపత్తుల సహాయ నిర్వహణను సమర్థంగా జరపడం కోసం 2022లో కొత్తగా 18 ఫైర్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం బడ్జెట్లో హోంశాఖకు రూ.9,599 కోట్లు ప్రతిపాదిస్తున్నాం’’
కేటాయింపులిలా..
 నీటి పారుదల రంగం రూ.26,885 కోట్లు
 వ్యవసాయ రంగం రూ.26,831 
 విద్యుత్‌ రంగం రూ.12,727 కోట్లు
 ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
 ఆసరా పింఛన్లకు రూ.12,000 కోట్లు
 దళితబంధుకు రూ.17,700 కోట్లు
 గిరిజన సంక్షేమం, షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతినిధికి రూ.15,233 కోట్లు
 బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు
 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూ.3,210 కోట్లు
 మహిళా శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు
 మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
 హరితహారానికి రూ.1,471 కోట్లు
 విద్యారంగానికి రూ.19,093 కోట్లు
 వైద్య, ఆరోగ్యరంగానికి రూ.12,161 కోట్లు
 పల్లె ప్రగతి, పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
 పురపాలక శాఖకు రూ.11, 372 కోట్లు
 రోడ్లు భవనాలకు రూ.2,500 కోట్లు
 పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
 హోం శాఖకు రూ.9,599 కోట్లు
 కేసీఆర్ కిట్ కోసం రూ.200 కోట్లు
 కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1000 కోట్లు

Posted Date: 07-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం