• facebook
  • whatsapp
  • telegram

Jobs: తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు 67,820

తుది జాబితా సిద్ధం చేసిన ఆర్థికశాఖ 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు 67 వేలకు పైగా ఉన్నట్లు ఆర్థిక శాఖ నిర్ధారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించేందుకు తుది నివేదిక సిద్ధం చేసింది. ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలతో మేలో శాఖల వారీగా వివరాలు సేకరించారు. మొత్తం 52 వేల ఉద్యోగ ఖాళీలున్నట్లు అప్పట్లో మంత్రిమండలికి నివేదించారు. ఆ జాబితా సక్రమంగా లేదని, సమగ్ర సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో ప్రభుత్వ శాఖలు మళ్లీ కసరత్తు చేశాయి. గత మంత్రిమండలి భేటీలో ముసాయిదా నివేదిక ఇచ్చాయి. ఆ ప్రాతిపదికన వివరాలు ఇవ్వాలని సీఎం అప్పట్లో సూచించడంతో.. అన్ని శాఖలు ప్రక్రియ పూర్తిచేసి గత వారం నివేదిక సమర్పించాయి. అన్నింటినీ క్రోడీకరించగా 67,820 ఖాళీలు తేలాయి. పూర్తి జాబితాను ఈ నెలలో జరిగే మంత్రిమండలి సమావేశంలో సమర్పించనుంది. మంత్రివర్గం ఆమోదం అనంతరం నోటిఫికేషన్లకు ప్రభుత్వం అనుమతించే వీలుంది.

Posted Date : 24-08-2021