• facebook
  • whatsapp
  • telegram

TS INTER: 70% సిల‌బ‌స్‌తోనే జూనియ‌ర్ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు  

* వెబ్‌సైట్లో మాదిరి ప్రశ్నపత్రాలు

* ఇంటర్‌ బోర్డు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గత విద్యా సంవత్సరానికి(2020-21) సంబంధించి అక్టోబర్‌ 25వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను 70 శాతం సిలబస్‌ ఆధారంగానే నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జలీల్‌ అక్టోబర్‌ 12న ప్రకటన జారీ చేశారు. అన్ని సబ్జెక్టుల మాదిరి ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్లో(www.tsbie.cgg.gov.in) అందుబాటులో ఉంచామని తెలిపారు. లెర్నింగ్‌ మెటీరియల్‌ను వెబ్‌సైట్లో ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాదే ప్రకటించినట్లు ప్రశ్నపత్రాల్లో ఐచ్ఛికాలు(ఛాయిస్‌) పెంచామని.. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని జలీల్‌ సూచించారు. 

 

ఈ ఏడాది సిలబస్‌పై స్పష్టత ఎప్పుడో..

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చే మార్చి/ ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలకు సిలబస్‌ ఎంత అన్నది ఇంటర్‌ బోర్డు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. సిలబస్‌ తగ్గించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ గత నెలలో సూచించింది. ఈ క్రమంలో గత ఏడాది మాదిరిగా ఈసారీ 70 శాతమే ఉండొచ్చని భావిస్తున్నా.. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

సత్వర ఉపాధికి ఒకేషనల్‌ దారి!

ఉపాధినిచ్చేలా విభిన్న బ్రాంచీల సమ్మేళనం

గణితశాస్త్రం 1B

భౌతికశాస్త్రం

వృక్షశాస్త్రం

అవుతారా.. అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి?

Posted Date : 12-10-2021