• facebook
  • whatsapp
  • telegram

Recruitment: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ 280 పైలట్ల నియామకాలు

ముంబయి: చౌక ధరల అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ 280 మంది పైలట్లను, 250 మంది విమాన కేబిన్‌ క్రూ సిబ్బందిని నియమించుకున్నట్లు ప్రకటించింది. దిల్లీ, ముంబయి, బెంగళూరులో ఇటీవల నియామకాల ప్రక్రియను సంస్థ నిర్వహించింది. ఇందులో సుమరు 300 మంది పైలట్లు పాల్గొన్నారని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది. ఇంతకుమునుపు భారత ప్రభుత్వానికి చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌.. ప్రస్తుతం టాటా గ్రూపు అధీనంలో ఉంది. గతేడాది జనవరిలో ఎయిరిండియాతో పాటు ఈ సంస్థను టాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.