• facebook
  • whatsapp
  • telegram

CSE: మొత్తం సీట్ల‌లో స‌గానికిపైగా సీఎస్ఈ

సీఎస్‌ఈ సంబంధిత కోర్సుల్లో కన్వీనర్‌ కోటావి 34,129

ఆ తర్వాత 12,582 సీట్లతో ఈసీఈది రెండో స్థానం

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ సీట్ల పరిస్థితిది

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌ చదువుతున్నానని ఎవరైనా విద్యార్థి చెబితే ఏ బ్రాంచీ అని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం ఇక రాష్ట్రంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ సీట్లలో సగానికిపైగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ), ఆ కోర్సుకు సంబంధించిన కొత్త బ్రాంచీల్లో ఉండటమే కారణం. దానికితోడు అత్యధిక మంది విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌నే కోరుకుంటున్నారు. ఫలితంగా ఆ సీట్లే దాదాపు 95 శాతానికిపైగా భర్తీ అవుతున్నాయి. అత్యంత నాసిరకం కళాశాలల్లోనే సీఎస్‌ఈ సీట్లు మిగిలిపోతున్నాయి. ఈసారి మొత్తం 45 ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లో కన్వీనర్‌ కోటాలో 66,290 సీట్లు ఉండగా అందులో సీఎస్‌ఈ సీట్లే 16,801 ఉన్నాయి. దానికి సంబంధించిన ఇతర బ్రాంచీలైన ఐటీ, ఏఐఅండ్‌ ఎంఎల్‌, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ తదితర వాటిల్లో కలుపుకొని మొత్తం 34,129 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే 51 శాతంతో సమానం. ఏటా కన్వీనర్‌ కోటాలో 65 వేల నుంచి 70 వేల సీట్లు ఉంటుండగా అందులో 48 వేల వరకే భర్తీ అవుతున్నాయి. ఈసారి ఈఈఈ, సివిల్‌, మెకానికల్‌ బ్రాంచీల్లో సీట్లన్నీ కలిపినా సీఎస్‌ఈ సీట్లన్నే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం సీట్లు...అంటే 6,629 పెరుగుతాయి. సీఎస్‌ఈ, సంబంధిత సీట్లు 34,129 ఉండగా మరో 3,412 సీట్లు పెరుగుతాయి. ఈ లెక్కన ఈసారి మొత్తం కంప్యూటర్‌ సంబంధిత సీట్లే 37,541 ఉంటాయి.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

 

బ‌డికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి

పాఠాలపై దృష్టి నిలవటంలేదా?

Posted Date : 15-09-2021