* సెప్టెంబర్ 19న నోటిఫికేషన్
![]() |
ఈనాడు, హైదరాబాద్: బీఈడీతో పాటు బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఎడ్‌సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ రెండింటికీ సంబంధించి నోటిఫికేషన్ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేష్‌బాబు, విద్యామండలి ఉపాధ్యక్షుడు షేక్ మహమూద్, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు గురువారం(సెప్టెంబర్ 14) సమావేశమై కౌన్సెలింగ్ కాలపట్టికలను ఖరారు చేశారు. అక్టోబరు 30 నుంచి తరగతులు మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఎడ్‌సెట్-2023లో మొత్తం 26,994 మంది కనీస మార్కులు సాధించి ప్రవేశాల కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. గత విద్యా సంవత్సరం(2022-23)లో 211 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కళాశాలల్లో మొత్తం 18,350 సీట్లు ఉన్నాయని, చివరకు వాటిల్లో 13,756 మంది ప్రవేశాలు పొందారని చెప్పారు.
అక్టోబరు నాటికి కౌన్సెలింగ్‌లు పూర్తి
అక్టోబరు నాటికి అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇప్పటికే ఎంసెట్ ఇంజినీరింగ్, ఈసెట్ పూర్తయ్యాయి. ఎంసెట్ ఫార్మసీ, పీజీఈసెట్, ఐసెట్ కౌన్సెలింగ్‌లు నడుస్తున్నాయి. ఎడ్‌సెట్, పీఈసెట్‌లకు షెడ్యూల్ ఖరారు చేసినందున ఇక మిగిలింది లాసెట్ మాత్రమే. దాన్ని ఈనెలాఖరుకు ప్రారంభించాలన్న లక్ష్యంతో ఉన్నారు. కళాశాలలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అక్టోబరు చివరి నాటికి కౌన్సెలింగ్‌లు అన్నీ పూర్తి చేయడంతోపాటు తరగతులు కూడా ప్రారంభించాలని నిర్ణయించారు.
కౌన్సెలింగ్ కాలపట్టిక
విషయం | ఎడ్‌సెట్ | పీఈసెట్ |
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, పరిశీలన | సెప్టెంబరు 20 నుంచి 30 వరకు | సెప్టెంబరు 20-25 |
అర్హులైన అభ్యర్థుల వివరాల ప్రదర్శన | అక్టోబరు 2 | సెప్టెంబరు 27 |
వెబ్ ఆప్షన్ల నమోదు | అక్టోబరు 3-5 | సెప్టెంబరు 28, 2 |
సీట్ల కేటాయింపు | అక్టోబరు 9 | సెప్టెంబరు 30 |
కళాశాలల్లో స్వయంగా రిపోర్టింగ్ | అక్టోబరు 10-13 | అక్టోబరు 4-7 |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.