* ఫలితాల కోసం క్లిక్ చేయండి
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్ సెప్టెంబర్ 14న విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2వ తేదీల్లో ఐబీపీఎస్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545 క్లర్క్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతోంది. పరీక్ష రాసిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలు పరిశీలించుకోవచ్చు. ఈ అవకాశం సెప్టెంబర్ 21 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అక్టోబర్‌లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.