• facebook
  • whatsapp
  • telegram

KGBV: పది కేజీబీవీల్లో ఇంటర్‌ తరగతులు

దేవరుప్పుల(జనగామ జిల్లా), న్యూస్‌టుడే: మధ్యలో చదువు మానేసిన బలహీన వర్గాల సామాజిక వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఆవాస విద్య అందిస్తున్న కస్తూర్బా పాఠశాలలకు మరిన్ని సొబగులు అద్దుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 కేజీబీవీలలో ఇంటర్‌ తరగతులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన పది పాఠశాలలున్నాయి. వీటిలో పలు ప్రమాణాలు గమనంలోకి తీసుకొని ఇంటర్మీడియేట్‌తో పాటు మల్టీపర్పస్‌ హెల్త్‌వర్కర్‌ తరగతుల నిర్వహణకు అనుమతించారు. ప్రతి కోర్సులో 40 సీట్లు ఉంటాయి.

 

విద్యాలయాల ప్రాంతం, కోర్సుల వారీగా.. 

జయశంకర్‌ భూపాలపల్లిలో రాఘవరెడ్డిపేట (ఎంపీసీ, బీపీసీ), పలిమెల, భూపాలపల్లి, మహాముత్తారం, మొగుళ్లపల్లి, రేగొండ (సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ), మహబూబాబాద్‌ జిల్లాలో గంగారం (ఎంపీసీ, బీపీసీ), ములుగు జిల్లాలో తాడ్వాయి, ములుగు (సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ), హనుమకొండ జిల్లా ఐనవోలు (ఎంపీసీ, బీపీసీ) ఉన్నాయి.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఎన్‌ఐఓఎస్‌లో 115  ఖాళీలు

‣ ఐటీలో జోరుగా నియామకాలు 

‣ ఆదాయం చాలదు... రుణం తీరదు!

‣ ఆ సంఖ్యలో తొమ్మిదులెన్ని?

 

Posted Date : 22-09-2021