ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జూన్ 23 నుంచి జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి. తొలిరోజు బీఆర్క్ ప్రవేశపరీక్ష (పేపర్-2) నిర్వహిస్తారు. ఆ తర్వాత రోజు నుంచి జూన్ 29 వరకు బీటెక్ ప్రవేశపరీక్ష (పేపర్-1)లు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది ఈ పరీక్ష రాయనున్నారు. గత ఏడాది జులైలో జరిగిన జేఈఈ మెయిన్‌కు తెలంగాణ నుంచి 62,091 మంది, ఏపీ నుంచి 73,263 మంది హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు ముఖ్యమైన పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్‌టికెట్లతోపాటు సూచనలను క్షుణ్నంగా చదవాలని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సూచించింది. మధుమేహం ఉన్న అభ్యర్థులు ఔషధాలు, పండ్లు తెచ్చుకోవచ్చని పేర్కొంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సివిల్స్ విజేతలకు అద్భుత శిక్షణ
‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?
‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?
‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.