• facebook
  • whatsapp
  • telegram

No Fees: క‌రోనాతో అనాథ‌లైన విద్యార్థులకు ఫీజు లేదు: సీబీఎస్‌ఈ

రిజిస్ట్రేషన్ స‌హా పరీక్ష రుసుంల నుంచి మినహాయింపు

దిల్లీ: 2022లో పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో కొవిడ్‌-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఎలాంటి రిజిస్ట్రేషన్, పరీక్ష ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పేర్కొంది. ‘‘కొవిడ్‌-19 మహమ్మారి దేశంలో చాలా మందిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కరోనా కారణంగా తల్లిదండ్రులను లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన విద్యార్థుల నుంచి 2021-22కు సంబంధించి రిజిస్ట్రేషన్, పరీక్ష ఫీజులు వసూలు చేయరాదని సీబీఎస్‌ఈ నిర్ణయించింది’’ అని సీబీఎస్‌ఈ పరీక్షల అధికారి భరద్వాజ్‌ చెప్పారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఐఓసీఎల్‌లో 513 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

‣ అవుతారా.. అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి?

‣ అనువుగా..  ఆన్‌లైన్‌ అభ్యాసం! 

‣ నేర్చుకుంటే.. అవకాశాల జోరు!

Posted Date : 22-09-2021