• facebook
  • whatsapp
  • telegram

Promotions: దసరాలోపు ఉపాధ్యాయులకు పదోన్నతులు 

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులకు దసరాలోపు పదోన్నతులు కల్పించేందుకు సీనియారిటీ జాబితాను రూపొందించాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాధికారులకు కమిషనరేట్‌ ఆదేశాలు జారీ చేసింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను జిల్లా వెబ్‌సైట్‌లో ఉంచాలని పేర్కొంది. ఒకే యాజమాన్యంలో గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల వరకు పదోన్నతులు కల్పించాలని సూచించింది. గతంలో నెలవారీ పదోన్నతులు అమలు చేయగా కరోనా సమయంలో వీటిని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పదోన్నతులపై పలు ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన వినతి మేరకు కమిషనరేట్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ భాషలపై పట్టు.. భవితకు మెట్టు!

‣ మానవుల్లో శిలీంద్రాల వల్ల వచ్చే వ్యాధులు

Posted Date : 28-09-2021