• facebook
  • whatsapp
  • telegram

AP NIT: ఏపీ నిట్‌లో పెరిగిన సీట్లు

తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ఏపీ నిట్‌లో బీటెక్‌కు సంబంధించి 8 కోర్సులున్నాయి. గతేడాది 603 సీట్లు ఉండగా ఈ ఏడాది నుంచి ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 150 సీట్లు అదనంగా పెరగడంతో మొత్తం సంఖ్య 753కి చేరింది. ఇందులో 50 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులతో మిగిలిన సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులతో భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం సంస్థలో ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరానికి సంబంధించి సుమారు 2 వేల మంది చదువుకుంటున్నారు. వీరికి అదనంగా ప్రథమ సంవత్సరం వారు త్వరలో రానున్నారు. ఇటీవల జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేయటంతో విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియ ఆరు విడతల్లో ముగియనుంది. అక్టోబరు 27న తొలి రౌండ్‌ సీట్లను కేటాయించనున్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఆత్మస్థైర్యమే రక్ష!

‣ అవుతారా.. అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి?

‣ ఇంజినీరింగ్‌లో - ఈఐఈ

‣ ఇంజినీరింగ్‌లో ప్ర‌త్యేక కోర్సులు

‣ వ్యవసాయ కోర్సుల్లోకి విఖ్యాత సంస్థ ఆహ్వానం!

‣ డీఆర్‌డీఓ, ఐటీఆర్‌లో 116 అప్రెంటిస్‌లు 

Posted Date : 20-10-2021