• facebook
  • whatsapp
  • telegram

Tenth, Inter Exams: ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీలు ఖ‌రారు

ఏప్రిల్‌ 27 నుంచి పదో తరగతి పరీక్షలు 

 

 

ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షలను ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ మారిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షల తేదీలను ముందుకు తీసుకొచ్చారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే నెల రెండో తేదీ నుంచి 13 వరకు నిర్వహించాల్సి ఉంది. అనంతరం మే 9 నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఇచ్చి, ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షల కారణంగా ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ నుంచి మే నెలకు రావడంతో మే నెలలో ప్రారంభించాల్సిన పది పరీక్షలను ఏప్రిల్‌కు తీసుకొచ్చారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయి. ఈసారి ఏడు పేపర్ల విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రం ఒక పేపర్‌గా.. జీవశాస్త్రం మరో పేపర్‌గా 50మార్కుల చొప్పున ఉంటాయి. మిగతా అన్ని సబ్జెక్టులు వంద మార్కులకు నిర్వహిస్తారు.

 

 

 

ఇంటర్‌ పరీక్షలు మే 6 నుంచి

ఇంటర్మీడియట్‌ పరీక్షలను మే 6 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు మార్చి 18న‌ విడుదల చేశారు. జేఈఈ మెయిన్‌ పరీక్షల కారణంగా ఇప్పటికే రెండు పర్యాయాలు ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ మారిన విషయం విదితమే. తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్‌ స్టడీమెటీరియల్

‣ ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్‌ మోడ‌ల్‌ పేప‌ర్లు

 

ఏపీ టెన్త్ క్లాస్‌ స్టడీమెటీరియల్

 

 ఇంగ్లిష్  గణిత శాస్త్రం
 జీవశాస్త్రం  సాంఘిక శాస్త్రం
మరిన్ని Subjects కోసం...

 

‣ ఏపీ టెన్త్ క్లాస్‌ మోడ‌ల్‌ పేప‌ర్లు

 

నిట్‌, పాట్నాలో జూనియర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు

సామర్థ్యాలపై సరైన అంచనా అవసరం

సైనిక్ స్కూల్‌-రేవాలో ఖాళీలు

ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.