• facebook
  • whatsapp
  • telegram

Jobs: విమానయాన రంగంలో లక్ష ఉద్యోగాలు

* వచ్చే రెండేళ్లపై కేంద్రం అంచనా

దిల్లీ: వచ్చే రెండేళ్లలో దేశీయ విమానయాన రంగంలో ప్రత్యక్షంగా మరో లక్ష ఉద్యోగాలు రావొచ్చని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పైలట్లు, కేబిన్‌ సిబ్బంది, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, విమానాశ్రయ సిబ్బంది, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌, కార్గో, రిటైల్‌, భద్రత, పాలన, విక్రయ సిబ్బంది.. ఇలా అందరూ కలిసి ఈ రంగంలో 2,50,000 మంది పనిచేస్తున్నారని ఆ శాఖ తెలిపింది. ‘ప్రస్తుతం విమానయాన, ఏరోనాటికల్‌ తయారీ రంగాల్లో 2,50,000 మంది పనిచేస్తున్నారు. ఈ సంఖ్య 2024 కల్లా 3,50,00కు పెరగవచ్చ’ని ఆ శాఖ తెలిపింది. ఈ రంగంలో పరోక్ష, ప్రత్యక్ష ఉద్యోగాల నిష్పత్తి 4:8గా ఉందని పేర్కొంది. ‘పెరగబోయే ప్రయాణికుల రద్దీ, భారత విమానాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుందే వచ్చే అయిదేళ్లలో మరో 10,000 మంది పైలట్లు అవసరమవుతార’ని అంచనా వేసింది.  2027 కల్లా విమాన ప్రయాణికుల సంఖ్య 40 కోట్లకు చేరొచ్చని కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అంచనా వేశారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫెయిల్ అయ్యారా... ఏం పర్లేదు!

‣ ఇంటర్‌లో ఏ గ్రూప్‌ను ఎంచుకోవాలి?

‣ స్వయంగా నేర్చుకుందాం

‣ మారిన పరిస్థితుల కోసం మరో వ్యూహం

‣ ఈడీ, జూనియర్‌ అసిస్టెంట్స్‌ పరీక్షలకు ఇదుగో వ్యూహం

‣ టెన్త్‌ తర్వాత ఏం చేయాలి? ఎలా నిర్ణయించుకోవాలి?

‣ ఉందా...మీకు రెండో మెదడు?

‣ స్నేహితుల ఒత్తిడిని తట్టుకోవాలంటే?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.