దిల్లీ: దేశవ్యాప్తంగా తన పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) విభాగాల కోసం 1,000 మంది ఇంజినీర్లను నియమించుకుంటామని శామ్సంగ్ ఇండియా వెల్లడించింది. బెంగళూరు, నోయిడా, దిల్లీలోని ఆర్అండ్డీ కేంద్రాల్లో, బెంగళూరులోని శామ్సంగ్ సెమీకండక్టర్ ఇండియా రీసెర్చ్‌లో కొత్త తరం సాంకేతికతలపై పనిచేసేందుకు ఈ నియామకాలు చేపడుతున్నట్లు శామ్సంగ్ ఇండియా మానవ వనరుల విభాగాధిపతి సమీర్ వాద్వాన్ తెలిపారు. 2023లో ఈ యువ ఇంజినీర్లు కంపెనీలో చేరతారని పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్‌తో పాటు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, వీఎల్ఎస్ఐ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్ నెట్వర్క్ విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నాయి. మద్రాస్, దిల్లీ, హైదరాబాద్, బొంబాయి, రూర్కే, ఖరగ్‌పూర్, కాన్పూర్, గువాహటి, బీహెచ్‌యూ ఐఐటీలతో పాటు ప్రముఖ విద్యాలయాల నుంచే సుమారు 200 మందిని నియమించుకోనున్నట్లు శామ్సంగ్ ఇండియా తెలిపింది. ఈ ఐఐటీలతో పాటు ఇతర దిగ్గజ విద్యాలయాల్లో 400 మందికి పైగా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఊహలకు రూపమిస్తూ... ఉత్పత్తులు రూపొందిస్తూ!
‣ పవర్ గ్రిడ్‌లో కొలువు కావాలా?
‣ ఉన్నాయా మీకు ఈ ఉద్యోగ లక్షణాలు?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.