• facebook
  • whatsapp
  • telegram

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ 14,000 అవకాశాలు

దిల్లీ: రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కర్ణాటకలో 3 కొత్త గోదాములు ఏర్పాటు చేసినట్లు వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఇకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. వేలమంది వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈలు, చిన్న రైతులకు సహకరించేలా 14,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపింది. కర్ణాటకలోని తమ కేంద్రాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 26,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.

Posted Date : 28-08-2021