• facebook
  • whatsapp
  • telegram

HCL Tech: హెచ్‌సీఎల్‌ టెక్‌లో 20,000 నియామకాలు

 

దిల్లీ: జులై-సెప్టెంబరులో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఏకీకృత నికర లాభం రూ.3,263 కోట్లకు చేరింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.3,146 కోట్లతో పోలిస్తే ఇది 3.7 శాతం అధికం. ఏకీకృత ఆదాయాలు రూ.18,594 కోట్ల నుంచి 11 శాతం పెరిగి రూ.20,655 కోట్లకు చేరుకున్నాయి. ‘డిజిటల్‌ వ్యాపారం ఆధ్వర్యంలోని మా సేవల పోర్ట్‌ఫోలియోలన్నిటిలోనూ బలమైన వృద్ధి నమోదైంది. అన్ని విభాగాల్లోనూ క్లయింట్లు జత చేరడం చూస్తుంటే గిరాకీ పెరుగుతోందనే విషయం స్పష్టమవుతోంద’ని హెచ్‌సీఎల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి విజయకుమార్‌ పేర్కొన్నారు.  14 కొత్త ఒప్పందాల ద్వారా మొత్తం కాంట్రాక్టు విలువ(టీసీవీ)38% పెరిగి రూ.16,564 కోట్ల (2245 మిలియన్‌ డాలర్లు)కు చేరింది. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీలో నికరంగా 11,135 మంది చేరారు. గత ఆరేళ్లలోనే ఇవే అత్యధిక త్రైమాసిక నియామకాలు కావడం విశేషం. సెప్టెంబరు 30, 2021 చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,87,634కు చేరుకుంది. కళాశాలల నుంచి తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్‌) నుంచి ఈ ఏడాది 20,000-22,000 మందిని తీసుకోవాలని; వచ్చే ఏడాది 30,000 మందిని నియమించుకోవాలని కంపెనీ ప్రణాళికలు వేస్తోంది. 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ప్రాధాన్యం పెరుగుతున్న.. కామర్స్‌ కోర్సులు

‣ సబ్జెక్టుపై పట్టు.. పరిశోధనకు మెట్టు! 

‣ క్లౌడ్ కంప్యూటింగ్

‣ విశిష్ట సంస్థలో... విభిన్న భాషలు!

Posted Date : 16-10-2021