• facebook
  • whatsapp
  • telegram

UG, PG admissions: విదేశీ విద్యార్థులకు 25% సీట్లు

* యూజీ, పీజీ కోర్సులపై యూజీసీ మార్గదర్శకాలు

 

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని యూజీసీ గుర్తింపు పొందిన అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు యూజీ, పీజీ కోర్సుల్లో విదేశీ విద్యార్థులకు 25 శాతం సీట్లను సూపర్‌ న్యూమరరీ కోటా కింద కేటాయించవచ్చు. అంటే ఇప్పుడున్న సీట్లకు అవి అదనం. ఈ మేరకు ప్రవేశాలపై యూజీసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్యను పెంచాలని నూతన జాతీయ విద్యావిధానంలో నిర్ణయించారు. ఈ క్రమంలోనే యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక కళాశాలలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో 500 సీట్లు ఉంటే వాటికి అదనంగా 125 సీట్లను విదేశీ విద్యార్థులకు కేటాయించుకోవచ్చు. ఒకవేళ అందులో మిగిలిపోతే వాటిని ఇతరులకు కేటాయించరాదు. ఆ సీట్లను విదేశీ పాస్‌పోర్ట్‌ ఉన్న విద్యార్థులకే ఇవ్వాలి.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏ ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావాలి?

‣ ఏపీఈఏపీ సెట్‌ ప్రవేశాల్లో మార్పులు

‣ కనుమరుగవుతున్న లంకలు

‣ శాస్త్రసాంకేతిక అగ్రశక్తిగా చైనా

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.