• facebook
  • whatsapp
  • telegram

Jobs: విప్రోలో 25000 నియామకాలు  

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో కళాశాలల నుంచి 25,000 మంది తాజా ఉత్తీర్ణులను నియమించుకుంటామని విప్రో సంస్థ‌ ప్రకటించింది.  రెండో త్రైమాసికానికి సంబంధించిన స‌మావేశంలో ఈ మేర‌కు వెల్ల‌డించింది. జులై - సెప్టెంబరులో విప్రో ఏకీకృత ప్రాతిపదికన రూ.2,930.60 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020 - 21 ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,484,40 కోట్ల లాభంతో పోలిస్తే ఈసారి 17% పెరిగింది. ఆదాయం కూడా రూ.15,114.50 కోట్ల నుంచి 30% వృద్ధితో రూ.19,667.40 కోట్లకు చేరింది. వార్షిక ఆదాయపరంగా 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.75,300 కోట్ల) మైలురాయిని అధిగమించామని విప్రో తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో ఐటీ సేవల విభాగ ఆదాయం 29.5% పెరిగి రూ.19,378.38 కోట్లుగా (2,580 మిలియన్‌ డాలర్లు) నమోదైంది. స్థిర కరెన్సీ రూపేణా ఈ విభాగ ఆదాయం ఏడాదిక్రితంతో పోలిస్తే 28.8%, ఏప్రిల్‌- జూన్‌తో పోలిస్తే 8.1% పెరిగాయి. సమీక్షా త్రైమాసికంలో వివిధ ప్రాంగణాల నుంచి 8,100 మంది ఫ్రెషర్లను కంపెనీ నియమించుకుంది. 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఆ ఫలితాన్ని రెట్టింపు చేస్తే..?

‣ విజయానికి ఎనిమిది సూత్రాలు

‣ కోర్ జావా డెవ‌ల‌ప‌ర్‌

‣ ఎస్‌బీఐలో 606 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్లు

‣ ఐసీఎఫ్‌, చెన్నైలో 794 అప్రెంటిస్‌లు

‣ పది చాలు.. వేల ఉద్యోగాలు!

Posted Date : 14-10-2021