• facebook
  • whatsapp
  • telegram

TS Schools: తరగతి గదుల్లో నిబంధన దూరం 3 అడుగులే

ఇంటర్‌ విద్యాశాఖ మార్గదర్శకాల్లో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని తరగతి గదుల్లో భౌతిక దూరం నిబంధన ఆరు అడుగుల నుంచి మూడు అడుగులకు తగ్గింది. కనీసం ఆరు అడుగులు ఉండాలని గత విద్యా సంవత్సరం ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌ జారీ చేసిన మార్గదర్శకాల్లో ఒక మీటరు దూరం...అంటే 3.28 అడుగులు ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా అందులో ఇప్పటివరకు 1.07 లక్షల మంది ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్, ఒకేషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. ప్రవేశాల గడువు ఆగస్టు 31వ తేదీ వరకు ఉంది. పాఠశాల విద్యాశాఖ మాత్రం భౌతిక దూరం ఎన్ని అడుగులో స్పష్టత ఇవ్వలేదు. గది పరిమాణాన్ని బట్టి ప్రణాళిక రూపొందించుకోవాలని మాత్రమే సూచించింది.

Posted Date : 28-08-2021