• facebook
  • whatsapp
  • telegram

అన్ని కోర్సుల్లో యాజ‌మాన్య కోటా 30%

ఈనాడు, అమరావతి: సాధారణ డిగ్రీ, పీజీ సహా అన్ని వృత్తి విద్యా కోర్సుల్లోనూ కన్వీనర్‌ కోటా 70%, యాజమాన్య కోటా 30 శాతంగా సీట్లు ఉండనున్నాయి. ఇప్పటి వరకు ఎల్‌ఎల్‌బీ, బీఈడీ, బీపీఈడీ లాంటి కోర్సుల్లో కన్వీనర్‌ కోటా 75%, యాజమాన్య కోటా 25శాతంగా ఉంది. తాజాగా అన్ని కోర్సుల్లోనూ యాజమాన్య కోటాను 30శాతంగా నిర్ణయిస్తూ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిఫార్సు చేసింది. దీనిపై ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.


 

Posted Date : 05-08-2021