• facebook
  • whatsapp
  • telegram

7.5% Quota: ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థుల ఖర్చులను భ‌రించ‌నున్న తమిళనాడు  

ప్రొఫెషనల్ కోర్సుల్లో 7.5 శాతం కోటా కింద రాష్ట్రంలో ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థుల ట్యూషన్ ఫీజులను తమిళనాడు ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ సంస్థలలో అందించే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, లా, ఇతర ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అడ్మిషన్ల కోసం తమిళనాడు ప్రభుత్వం గత నెలలో 7.5 శాతం రిజర్వేషన్లను "ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన" కేటాయించింది.
50 మంది ఇంజినీరింగ్ అభ్యర్థులకు ప్రవేశ ఉత్తర్వులను అందజేసిన స్టాలిన్, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల కోసం 10 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రిజర్వేషన్ల నుంచి ప్రయోజనం పొందుతారని, 350 మంది వ్యవసాయం, పశువైద్యం, మత్స్యసంపద, న్యాయ కోర్సుల్లో ప్రవేశిస్తారని చెప్పారు.
‣ "7.5 శాతం కోటా ద్వారా ప్రొఫెషనల్ కాలేజీల్లో ప్రవేశించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, కౌన్సెలింగ్ ఫీజులను కూడా భరించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది" అని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే అధికార డీఎంకే ప్రయత్నంలో భాగంగా రిజర్వేషన్ ఉంద‌ని స్టాలిన్ తెలిపారు. అటువంటి పాఠశాలల్లో 6 నుంచి 8 వ తరగతి వరకు చదివిన విద్యార్థులు కొత్త కోటా ద్వారా ప్రయోజనం పొందుతారని ఆయన చెప్పారు.

Posted Date : 20-09-2021