• facebook
  • whatsapp
  • telegram

Inter: ఇంటర్‌లో సిల‌బ‌స్ 70 శాత‌మే!

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుత విద్యా సంవత్సరం(2021-22)లోనూ ఇంటర్‌లో 70 శాతం పాఠ్య ప్రణాళిక(సిలబస్‌) ఆధారంగానే వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు స్పష్టత ఇచ్చింది. జూనియర్‌ కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు మొదలైన దాదాపు మూడు నెలలకు నిర్ణయం వెలువరించడం గమనార్హం. ‘విద్యా సంవత్సర ప్రణాళిక ప్రకారం జూన్‌ 1వతేదీ నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా కారణంగా ఆగస్టు వరకు కళాశాలలు తెరుచుకోలేదు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి. ఈపరిస్థితులను సమీక్షించిన ప్రభుత్వం 30 శాతం పాఠ్య ప్రణాళికను తగ్గించిందని’ ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ న‌వంబ‌రు 22న ప్రకటన విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల్లో 70 శాతం సిలబస్‌ మాత్రమే ఉంటుందన్నారు. ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచుతారా? లేదా? అన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సిలబస్‌ వివరాలు, మాదిరి ప్రశ్నపత్రాలను బోర్డు వెబ్‌సైట్‌ www.tsbie.cgg.gov.in లో అందుబాటులో ఉంచుతామని జలీల్‌ వెల్లడించారు.

ప్రవేశాల గడువు పొడిగింపు

రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్‌ కళాశాలలు, గురుకులాల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును న‌వంబ‌రు 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు తెలిపింది. గతంలో ఇచ్చిన గడువు 12వ తేదీకి ముగిసినప్పటికీ, పదిరోజుల తర్వాత గడువు పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

ఐఎస్ఐ-కోల్‌క‌తాలో ట్రెయినీలు

ఎయిర్‌ ఇండియాలో వివిధ ఖాళీలు 

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

జిప్‌మ‌ర్‌-పుదుచ్చేరిలో వివిధ ఖాళీలు 

Posted Date : 23-11-2021