• facebook
  • whatsapp
  • telegram

One Day Collector: జిల్లా కలెక్టర్‌గా ఏడో తరగతి విద్యార్థిని!

బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ బాలిక ఒక రోజు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించి ఐఏఎస్‌ కావాలన్న తన కోరికను నెరవేర్చుకుంది. చిన్నప్పటి నుంచి కలెక్టర్‌ కావాలన్న 11 ఏళ్ల ఫ్లోరా అసోడియా కలను మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ నెరవేర్చింది. ‘‘గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఫ్లోరా బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతోంది. గతనెలలో శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆ బాలిక కలెక్టర్‌ కావాలనుకుంటున్నట్లు మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ నుంచి మాకు సందేశం వచ్చింది. దీంతో ఆమెను ఒకరోజు కలెక్టర్‌గా ఉంచాలని ఫ్లోరా తల్లిదండ్రులను అభ్యర్థించాం. శస్త్రచికిత్స తర్వాత ఆమె పరిస్థితి క్షీణించడం వల్ల వారు విముఖత వ్యక్తం చేశారు. చివరకు వారిని ఒప్పించి ఆమె కలను నెరవేర్చడంలో విజయం సాధించాం’’ అని అహ్మదాబాద్‌ కలెక్టర్‌ సందీప్‌ సింగ్లే చెప్పారు. సెప్టెంబరు 25న ఫ్లోరా పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. కుమార్తె కల నెరవేర్చినందుకు ఫ్లోరా తండ్రి ఆనందం వ్యక్తం చేశారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ I owe it all to my mother

‣ ఏక దృష్టి.. ఎదురులేని అస్త్రం! 

Posted Date : 20-09-2021