• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌కు తొలిరోజు 91.18 శాతం హాజ‌రు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఆగ‌స్టు 4న‌ ప్రారంభమైన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం మొదటి రోజు పరీక్షలకు 91.18 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో 54,983 మందికి 50,134 మంది పరీక్షలు రాశారు. గతేడాది సెప్టెంబరు 9న జరిగిన తొలి రోజు పరీక్షలకు 77.52 శాతం విద్యార్థులే హాజరయ్యారు. ఈ సారి దాదాపు నెల రోజులు ముందుగా పరీక్షలు నిర్వహించడంతోపాటు ఇంటర్‌లో 100 శాతం మంది ఉత్తీర్ణులవడంతో హాజరు శాతం సాధారణ స్థితికి చేరుకుందని అధికారులు భావిస్తున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి జేఎన్‌టీయూహెచ్‌లో కన్వీనర్‌ గోవర్ధన్‌ తదితరులతో పరీక్షలపై సమీక్షించారు. ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌.. వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాలలో పరీక్ష తీరును పరిశీలించారు.

Posted Date : 05-08-2021