• facebook
  • whatsapp
  • telegram

ఈసెట్‌కు 95.46 శాతం హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: రెండు రాష్ట్రాల్లో ఆగ‌స్టు 3న నిర్వహించిన తెలంగాణ ఈసెట్‌కు 95.46 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 24,808 మందికి 23,681 మంది పరీక్షలు రాశారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి, రెక్టార్‌ ఆచార్య గోవర్ధన్‌ తదితరులు హాజరై ఉదయం ప్రశ్నపత్రాల సెట్లను ఎంపిక చేశారు. కన్వీనర్‌ సీహెచ్‌.వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 5వ తేదీ నాటికి ప్రాథమిక కీని వెబ్‌సైట్లో ఉంచుతామన్నారు. మూడు లేదా నాలుగు రోజుల సమయం ఇచ్చి అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు.

Posted Date : 04-08-2021