ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడో వంతు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 30లోపే ఉంది. పాఠశాల విద్యాశాఖ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ బడులు మొత్తం 26,337 ఉండగా అందులో 8,782 (33.35%) చోట్ల పిల్లలు 1-30 మందే ఉన్నారు. వాటిలో 8,665 ప్రాథమిక పాఠశాలలు ఉండగా మిగిలిన 117 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు. వంద మంది పిల్లల కంటే ఎక్కువ ఉన్న పాఠశాలలు కేవలం 6,933 (26.32 శాతం) మాత్రమే.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.