• facebook
  • whatsapp
  • telegram

Admissions: ఎస్సీ గురుకులాల్లో సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రవేశాలు  

* మంత్రి మేరుగు నాగార్జున

 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఈ ఏడాది పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకూ ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు కల్పించాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. ఇంటర్‌లో ఎంఈసీ, సీఈసీ కోర్సులను ఎంపీసీ, బైపీసీలుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గురుకులాల్లో ప్రవేశాల తీరుపై ఆగ‌స్టు 16న సచివాలయంలో మంత్రి సమీక్షించి, మాట్లాడారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు కల్పించరాదనే నిబంధనను సడలించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క సీటూ ఖాళీగా ఉండకూడదని, పాఠశాల స్థాయిలో భర్తీ అయితే జిల్లా స్థాయిని ప్రాతిపదికగా తీసుకుని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనంగా సీట్లు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలన్నారు. విద్యాప్రమాణాలు మెరుగుకు వారాంతపు పరీక్షలు పెట్టాలని, ట్యూటర్లను నియమించాలని ఆదేశించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.