• facebook
  • whatsapp
  • telegram

Agnipath: వాయుసేన అగ్నిపథ్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

* జూన్‌ 24 నుంచి జులై 5వ తేదీ వరకు

 

 

ఇంటర్నెట్‌డెస్క్‌: వాయుసేనలో అగ్నిపథ్‌ కింద నియామకాల కోసం రిజిస్ట్రేషన్లు జూన్‌ 24 నుంచి మొదలయ్యాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు http://agnipathvayu.cdac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5వ తేదీన ముగుస్తుంది. అగ్నిపథ్‌కు అవసరమైన నిబంధనలు అభ్యర్థులు పాటించాలి. అభ్యర్థులు దరఖాస్తు, జతచేసిన స్కాన్‌ కాపీలను తమ వద్ద ఉంచుకోవాలని అధికారులు సూచించారు. అగ్నివీర్‌ తొలి బ్యాచును 2022 డిసెంబర్‌ 11 నాటికి ప్రకటించనున్నారు.

 

సాయుధ బలగాల్లో నియామకాల కోసం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్‌ (Agnipath) పథకంపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. కానీ, దీనిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే ఆర్మీలో అగ్నివీరుల  (Agniveer) నియామకాల కోసం భారత సైన్యం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జులై నుంచి దీని రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే, నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు (Agniveers) రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లోనూ 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉందా...మీకు రెండో మెదడు?

‣ స్నేహితుల ఒత్తిడిని తట్టుకోవాలంటే?

‣ కంప్యూటర్‌ సైన్స్‌కే జై!

‣ కోల్‌ ఇండియాలో కొలువులు

‣ సుప్రీంకోర్టులో జూనియర్‌ కోర్ట్‌ అసిస్టెంట్‌ ఖాళీలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.