• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన వర్సిటీల్లో ప్రవేశాల గడువు పెంపు  

తిరుపతి (పశువైద్య విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ, శ్రీ వేంకటేశ్వర పశువైద్య, వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు అక్టోబ‌రు 26వ తేదీ వరకు పొడిగించినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.గిరిధర్‌కృష్ణ అక్టోబ‌రు 13న‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఈఏపీసెట్‌ విద్యార్థులు ఇంటర్‌ అర్హతతో గుంటూరు జిల్లా లాంఫారమ్‌లోని కమ్యూనిటీ సైన్స్‌ కళాశాలలో ప్రవేశాలు పొందవచ్చని చెప్పారు. ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ పరిధిలోని వ్యవసాయ కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటాలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అక్టోబ‌రు 23న గుంటూరులోని వర్సిటీ పరిపాలన భవనంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. అర్హులైన విద్యార్థుల జాబితా వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉందన్నారు. డిగ్రీ ప్రవేశాలు, కమ్యూనిటీ సైన్స్‌ కళాశాలల్లో ప్రవేశాలు, ఎన్‌.ఆర్‌.ఐ కోటా అర్హుల జాబితాకు angrau.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ సమగ్రంగా.. స్పష్టంగా!

‣ పాలిటీపై పట్టు సాధించడం ఎలా?

‣ మేటి భవితకు మల్టీ డిసిప్లినరీ కోర్సు

‣ ముంగిట్లో ముష్కరుల ముప్పు

‣ ఫ్యాషన్‌గా కెరియర్‌ డిజైన్‌! 


 

Posted Date : 14-10-2021