• facebook
  • whatsapp
  • telegram

Aided Staff: ఎయిడెడ్‌ సిబ్బంది విలీనానికి షెడ్యూల్‌ విడుదల

చిత్తూరు విద్య: ఎయిడెడ్‌ పాఠశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బంది ప్రభుత్వ, పురపాలక, జడ్పీ పాఠశాలల్లో విలీనం కానున్నారు. పాఠశాల విద్యాశాఖ బోధన, బోధనేతర సిబ్బంది సీనియారిటీ జాబితా రూపొందించి షెడ్యూల్‌ని ప్రకటించింది. అక్టోబరు 20, 21, 22వ తేదీల్లో సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ ప్రకటించనుంది. అక్టోబరు 27 వరకు ఈ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 31న తుది సీనియారిటీ జాబితా, నవంబరు ఒకటో తేదీన జిల్లాలో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల వివరాలు ప్రకటిస్తారు. 2 నుంచి 5 వరకు వెబ్‌ ఆప్షన్స్‌లో ఖాళీల జాబితాకనుగుణంగా నమోదు చేసుకోవాలి. 6న ఎంపిక చేసుకున్న పాఠశాలలకు సంబంధించి నియామక పత్రాలను డౌన్‌లోè్ చేసుకుని ఆ పాఠశాల నుంచి రిలీవ్‌ కావాలి. 7న కొత్త పాఠశాలలో జాయిన్‌ కావాల్సి ఉంది.

Posted Date : 20-10-2021