• facebook
  • whatsapp
  • telegram

VVIT: ‘అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌’ శిక్షణకు వీవీఐటీ ఎంపిక

పెదకాకాని, న్యూస్‌టుడే: అమెజాన్‌ సంస్థ నెలకొల్పిన ‘అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌’ ద్వారా అందించే ‘క్లౌడ్‌ కంప్యూటింగ్‌’ శిక్షణ తరగతులకు తెలుగు రాష్ట్రాల నుంచి గుంటూరు జిల్లా నంబూరు వద్దనున్న వీవీఐటీ కళాశాల ఎంపికైందని దాని ఛైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను అందిస్తున్న 21 వర్సిటీలు, కళాశాలలను ఆ సంస్థ ఎంపిక చేసిందని.. అందులో తమ విద్యాసంస్థ ఒకటని పేర్కొన్నారు. తమ కళాశాల నుంచి 25 మంది అధ్యాపకులు ఈ శిక్షణ తరగతులకు హాజరవుతారని వివరించారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంశాలతోపాటు డేటా అనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేధస్సు, మెషిన్‌ లెర్నింగ్‌ను అధ్యాపకులు నేర్చుకొని శిక్షణనిస్తారని తెలిపారు. దీనివల్ల విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌కు సంబంధించిన అనుబంధ విభాగాల్లో నైపుణ్యం సాధిస్తారని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ 3 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు!

‣ సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 339 అప్రెంటిస్‌లు

Posted Date : 18-09-2021