• facebook
  • whatsapp
  • telegram

Anganwadi: 26, 27 తేదీల్లో అంగన్‌వాడీ ఉద్యోగాలకు ముఖాముఖి 

మదనపల్లె గ్రామీణ: స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో అక్టోబరు 26, 27 తేదీల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఖాళీల భర్తీకి ముఖాముఖి నిర్వహించనున్నట్లు మదనపల్లె ఐసీడీఎస్‌ సీడీపీవో సుజాత అక్టోబరు 24న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి అధ్యక్షతన 26న ఉదయం 9 గంటల నుంచి కుప్పం, తంబళ్లపల్లె, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి చిన్నగొట్టిగల్లు, మదనపల్లె ఐసీడీఎస్‌ పరిధిలోని అభ్యర్థులకు, అలాగే 27 ఉదయం పలమనేరు, చౌడేపల్లె, మధ్యాహ్నం వాల్మీకిపురం, పుంగనూరు ఐసీడీఎస్‌ పరిధిలోని వారు హాజరు కావాలని చెప్పారు. కాల్‌లెటర్‌ అందుకున్న అభ్యర్థులు అర్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో కేటాయించిన సమయానికి ముందుగానే సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి రావాలన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ నైగ్రిమ్స్‌లో 63 సీనియర్‌ రెసిడెంట్లు

‣ ఎయిమ్స్‌, పట్నాలో 158 ఫ్యాకల్టీ పోస్టులు

‣ మహబూబ్‌నగర్‌ జిల్లా అంగన్‌వాడీల్లో 164 ఖాళీలు

‣ To get back at some body

‣ పది చాలు.. వేల ఉద్యోగాలు!

Posted Date : 25-10-2021