• facebook
  • whatsapp
  • telegram

Medical PG: పీజీ వైద్య విద్య యాజమాన్య కోటా ప్రవేశాలకు ప్రకటన

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: 2022-23 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, మైనార్టీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ డిగ్రీ/ డిప్లొమా, ఎండీఎస్‌ కోర్సుల యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించి డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగ‌స్టు 16న ప్రకటన విడుదల చేసింది. నీట్‌ పీజీ-2022 అర్హత సాధించిన అభ్యర్థులు ఆగ‌స్టు 17న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని సంబంధిత పత్రాలను జత చేసి పంపాల్సి ఉంటుంది. నీట్‌ పీజీలో జనరల్‌ కేటగిరీలో 275 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/బీసీలు  245 మార్కులు, అన్‌ రిజర్వుడు/ దివ్యాంగుల కేటగిరీ 260 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు. యాజమాన్య కోటా క్లినికల్‌ డిగ్రీ/డిప్లొమా కోర్సులకు రూ.8,64,000 (ఎస్‌1)గా, ఎన్నారై కోటా ఎస్‌ 2, ఎస్‌ 3 కేటగిరీలకు రూ.50,00,000 ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  సాంకేతికపరంగా సమస్యలుంటే 74165 63063, 74162 53073లకు, మార్గనిర్దేశకాల్లో సందేహాలుంటే 89787 80501 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సోషల్‌ మీడియాలో సమయం వృథా అవుతోందా?

‣ ఎల్‌ఐసీ హౌసింగ్‌లో కొలువులు

‣ శారీరక సామర్థ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారా?

‣ ఇంజినీరింగ్‌కి ఐఐటీ - మద్రాస్‌ టాప్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.