* జనవరి 22న ప్రాథమిక పరీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాల ప్రాథమిక రాత పరీక్షకు సంబంధించి వెబ్సైట్లో హాల్టికెట్లను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఏపీఎస్ఎల్పీఆర్బీ) ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఏపీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల తమ రిజిస్ట్రేషన్ నెంబర్, చరవాణి సంఖ్య, పుట్టిన తేదీ వివరాలతో అడ్మిట్ కార్డు పొందవచ్చు. మొత్తం 6,100 కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి జనవరి 22న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు సుమారు ఐదు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.